జీఎస్టీ పద్ధతి వచ్చిన తర్వాత .. టీడీఎస్ పద్ధతి అలవాటైన తర్వాత , కేసులు అరెస్టులు అనేవి పెరుగుతున్న కూడా టాలీవుడ్ లో బ్లాక్ మనీ 90 శాతం కనిపించకుండా పోయింది .. ఒక విషయం చెప్పకూడదు కానీ లక్ష రెండు లక్షల బ్లాక్ మనీ కావాలన్నా పుట్టని పరిస్థితిగా మారింది .. నిర్మాణ సంస్థల్లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్‌ను అలవాటు చేసుకున్నారు .. అలాగే డిస్టిబ్యూటర్లు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది కామన్ గా మారిపోయింది .. చివరికి అప్పులు ఇచ్చే ఫైనాన్సర్లు కూడా అన్ అకౌంట్ మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఐటీ దాడులకు నిర్మాతలు ఎందుకు ఇంత భయపడాలి .. చిత్ర పరిశ్రమలో ఇంకా బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ ఏమైనా జరుగుతుందా ?


నిజంగా జరుగుతుంది .. కేవలం ఒక్క రెండు పేమెంట్ ల కోసం బడ నిర్మాతలు బ్లాక్ మనీని తీసుకురావాల్సి వస్తుంది . ఒకటి స్టార్ హీరోల రెమ్యూనరేషన్ .. రెండు దర్శకుడు అంటే బడా దర్శకులు 10 కోట్లు నుంచి 100 కోట్ల వరకు తీసుకునే అగ్ర దర్శకులు .. ఇలాంటి వారికి కొంతవరకు బ్లాక్ మనీ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అలాగే హీరోల్లో .. ఎవరైనా సరే నాలుగైదు కోట్లు తీసుకునే వారి దగ్గర నుంచి 40 - 50 కోట్లు తీసుకునే వారు వరకు సగానికి సగం బ్లాక్ లో ఇవ్వాల్సిందే అంటూ ఓ నిర్మాత గతంలో తెలిపారు .. వీటి కోసం కచ్చితంగ నల్లధనం కోసం పరుగులు తీయాల్సి వస్తుందని .. లేకుంటే తమకు బ్లాక్ అవసరమే లేదని వారు అంటున్నారు.


అంతేకాకుండా ఇలా బ్లాక్ లో తెచ్చిన దానికి నెల నెల బ్లాక్ లోనే వడ్డీలు కట్టాల్సి ఉంటుంది .. ఎందుకంటే అప్పులు తెచ్చే కదా హీరోలకు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్లు అడ్వాన్సులు ఇచ్చేది .. ఈ విధంగా నెల నెల వడ్డీలు కట్టడానికి మళ్లీ మళ్లీ బ్లాక్ అమౌంట్ కోసం పరుగులు తియాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ఇక్కడ మరో గమ్మెత్త అయిన విషయం ఏమిటంటే .. ఎప్పుడూ నిర్మాతల మీద దాడుల వార్తలు వస్తున్నాయి కానీ .. ఒక‌ హీరోల ఇంటి మీద సాదాలు జరిగిన వార్తలు ఎక్కడ కనిపించిన, వినిపించిన‌ పాపాన్న కూడా లేవని కొందరు నిర్మాతలు ప్రశ్నించడం ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: