సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాల విషయంలో దిల్ రాజు హ్యాండ్ కచ్చితంగా ఉండింది . గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయింది. డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు . సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇక ఫైనల్లీ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా రిలీజ్ అయ్యి హ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది . ఇక్కడే దిల్ రాజుకి పెద్ద నెగిటివ్ ఏర్పడింది. ఆయన నిర్మించిన సినిమాలో అన్ని ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ అవ్వడంతో ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు ఆయన ఇంటిపై ఆఫీసులపై రైడ్శ్ నిర్వహించారు . అయితే దిల్ రాజు మాత్రం సేఫ్ గా ఈ వ్యవహారం నుంచి తప్పించుకున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది .
కాగా దిల్ రాజు పైనే ఎందుకు టార్గెట్ చేశారు ఐటీ రైడ్స్ వాళ్ళు అంటే మాత్రం ఓ ఫేక్ న్యూస్ కారణంగానే అంటూ తెలుస్తుంది. దిల్ రాజు 186 కోట్లు గేమ్ ఛేంజర్ సినిమా కలెక్ట్ చేసింది అని చెప్పడంతోనే ఐటి రైడ్శ్ నిర్వహించారు అంటూ టాక్ వినిపించింది . కానీ దాని వెనకాల రీజన్ అది కాదు అని రాంచరణ్ తో మరొక సినిమాను నిర్మిస్తున్నాడు దిల్ రాజు అంటూ వార్తలు రావడం ఆ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు అన్న టాక్ వినిపించడంతోనే ఐటి రైట్స్ నిర్వహించారు అని .. ఇంత డబ్బు ఆయన దగ్గర ఎలా వచ్చింది ..? అన్న కోణంలోనే రైడ్ చేశారు అంటూ టాక్ వినిపించింది. అయితే తీరా ఆ న్యూస్ నిజమేనా..? అంటూ ఆరా తీయ్యాగా.. రామ్ చరణ్ - దిల్ రాజు నిర్మాణంలో నటిస్తున్నాడా ..? అంటే మాత్రం అది ఫేక్ అంటూ బయటపడింది . అసలు గేమ్ ఛేంజర్ తర్వాత దిల్ రాజు .. రామ్ చరణ్ ఎక్కడ మీట్ అవ్వనే లేదు అని .. నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడనే లేదు అంటూ బయటపడింది . దీంతో ఒక్క ఫేక్ వార్త కారణంగా దిల్ రాజు ఐటి రైడ్స్ లో ఇరుక్కున్నారు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!