మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ .. తర్వాత వచ్చిన చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున ఇప్పటికీ టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా మూల స్తంభాలుగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని ఏలుతున్నారు .. నాలుగు దశాబ్దాలుగా వీరు చిత్ర పరిశ్రమలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు .. ప్రస్తుతరం యంగ్‌ హీరోల రాకతో వేళల్లో కొందరి హవా మాత్రం తగ్గింది .. అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ నలుగురు సీనియర్ హీరోలలో ముగ్గురు మాత్రం ఊహించిన విధంగా కం బ్యాక్ ఇచ్చారు .. మిగిలింది ఒకే ఒక్కడు అతనే నాగార్జున .. ముందుగా ఈ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి విషయానికొద్దాం .. మధ్యమధ్యలో ఆచార్య,  భోళా శంకర్ లాంటి డిజాస్టర్లు వచ్చినప్పటికీ .. చిరంజీవి మార్కెట్ ఎక్కడ చెక్కుచెదరలేదు .. ఇంకా చెప్పాలంటే సీనియర్ హీరోల్లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కూడా చిరంజీవినే ..


అదే విధంగా మొన్నటి వరకు మూడు నాలుగు ప్లాఫ్‌ల మధ్య ఒక హిట్ ఇస్తున్న నటసింహం బాలకృష్ణ కూడా .. బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా సింహగర్జన చేస్తున్నాడు .. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నాడు .. అదేవిధంగా విజయాలతో పాటు తన రెమ్యూనరేషన్ ని కూడా భారీగా పెంచుకుంటూ వెళ్తున్నాడు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ కెరియర్ కూడా ఊహించని రేంజ్ కు వెళ్ళింది .. సంక్రాంతి సీజన్లు క్లియర్ విన్నర్ గా నిలిచిన ఈ సినిమాతో వెంకటేష్ మరోసారి తానేంటో బాక్సాఫీస్ కి చూపించి తన మార్కెట్ వాల్యూ ని పెంచుకున్నాడు.


ఈ నలుగురు హీరోల్లో ఇక నిరూపించుకోవాల్సింది అక్కినేని నాగార్జున మాత్రమే .. బంగార్రాజు సక్సెస్ తర్వాత ది ఘోస్ట్ రూపంలో పెద్ద డిజాస్టర్ తెచ్చుకున్నారు నాగ్ .. ఇక‌ గత సంవత్సరం నా స్వామి రంగా సినిమాతో బ్రేక్ ఈవెన్‌ సాధించిన ఆ సినిమా ఆయన స్థాయి విజయం కాదు .. వెంకటేష్ కి సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా ఎలా పడిందో నాగార్జునకి కూడా ఆ స్థాయిలో ఒక సినిమా పడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక మరి ఈ కొత్త సంవత్సరంలో అయినా నాగార్జున కం బ్యాక్ ఇస్తే .. ఊహించని విధంగా సీనియర్ హీరోలు అంతా మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లు అవుతుంది .. అయితే నాగార్జున మాత్రం ఇప్పటివరకు హీరోగా తన మరో సినిమాని ప్రకటించలేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: