బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా ఎప్పుడు ఎలా హిట్ అవుతుందనేది ఎవరికీ తెలియదు .  ప్రేక్షకులు ఎప్పుడు ఏ సినిమాని ఆదరిస్తారనేది ఎవరు ఊహించరు .. ఇదే క్రమంలో ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమానే మొదటినుంచి క్రింజ్‌ కామెడీ అన్నారు , కానీ థియేటర్ వద్ద ప్రేక్షకులు క్యూ కడుతున్నారు , బ్రేక్ ఈవెన్ అయితే చాలనుకున్నారు, కానీ ఇప్పుడు డబుల్ డిజిట్ దాటి త్రిబుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు .. రెండు పెద్ద సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ సంక్రాంతి వార్‌లో క్లియర్ కట్ విన్నర్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ.
 

కేవలం ఆరు రోజుల్లోనే 100 కోట్లకు పైగా షేర్ సాధించడంతో పాటు .. ఓవ‌ర్సీస్‌లో కూడా 3 మిలియన్ మార్కు వైపు దూసుకుపోతుంది .. ఈ సినిమా క‌థ‌ కొత్తది కాదు , టేకింగ్ కూడా రొటీన్  ,భారీ ఫైట్లు , ఊహించిన ట్వీస్ట్‌లు కూడా ఉండవు .. ఇవన్నీ లేకపోయినా ఊహించిని విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి రీజ‌న్ ఏంటి ?  లాజిక్స్ తో ఎలాంటి సంబంధం లేకుండా వినోదం అందిస్తే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని గతంలో జాతిరత్నాలు ప్రూవ్ చేస్తే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరోసారి ఇదే విషయాన్ని క్లియర్గా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ నిరూపించింది.

 

అదే విధంగా వింటేజ్‌ వెంకటేష్ ని చూడటం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది .. ఇన్ని రోజులు వెంకటేష్ దగ్గర నుంచి మిస్సయిన ఎలిమెంట్ కూడా ఇదే.  అలాగే దీనికి తోడు సంక్రాంతి ఫెస్టివల్ బాగా కలిసి రావటం .. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాకు ప్రచారం చేయటం.  గోదారి గట్టు సాంగ్ తెగ వైరల్ అవటం ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి . అలాగే వీటన్నిటితో పాటు మిగతా రెండు సినిమాలతో పోలిస్తే టిక్కెట్ ధరలు కాస్త తక్కువగా ఉండటం కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బాగా కలిసి వచ్చింది .. పాన్ ఇండియా అంటూ బిల్డప్పులు ఇవ్వకుండా పూర్తిగా ఫ్యామిలీస్ ను టార్గెట్ చేయడం .. వినూత్న పద్ధతితో సినిమాకు ప్రమోషన్ చేయటం ఈ సినిమా సక్సెస్ లో ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: