మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అంటే అందరికి తెలుసు. తమిళ్ సంగీత దర్శకుడైనా సౌత్, బాలీవుడ్ లో కూడా అనిరుధ్ పరిచయమే. కేవలం తమిళ్ సినిమాలకే కాక తెలుగులో కూడా మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు. ధనుష్ 3 సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ మొదటి పాట వై దిస్ కొలవరి తోనే స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా, సింగర్ గా ఫుల్ బిజీ అయ్యాడు అనిరుధ్. దాదాపు 50 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన అనిరుధ్ చేతిలో ప్రస్తుతం ఓ డజను సినిమాలకు పైగానే ఉన్నాయి.ఇక సినిమాల్లో పాటలకు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇస్తాడని పేరు ఉంది. తమిళ్ స్టార్ హీరోలందరికీ సినిమాల్లో గుర్తుండిపోయే పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడు అనిరుద్. ఇటివలే జైలర్, లియో, దేవర సినిమాలతో అదరగొట్టాడు. అసలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే సినిమా హిట్ అయ్యేదే కాదేమో అన్నంతగా మెప్పించాడు అనిరుధ్.

ఇదిలావుండగా 2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.ఈ కాంబో రిపీట్ కావాలని అభిమానులు కోరుకుంటూనే వచ్చారు. రవితేజతో ప్రాజెక్టు మిస్సయ్యాక సన్నీ డియోల్ తో జాత్ చేస్తున్న మలినేని దాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఈ క్రమంలోనే అసలు కిక్కిచ్చే న్యూస్ మరొకటి ఉంది. ఈ క్రేజీ బాలయ్య – మలినేని మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. దేవరకు అదిరిపోయే పాటలు, బిజిఎం చూశాక తమ హీరోకు తను పని చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలావుండగా ఏ సౌండ్ ఎక్కడ కరెక్ట్ గా వాడాలో, ఎంత లెవల్లో వాడాలో అనిరుధ్ కి బాగా తెలుసు. దీంతో కేవలం పాటలకు సంగీతం మాత్రమే కాకుండా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై పట్టు సాధించి ఇప్పుడు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు అనిరుధ్. సంగీతం ఇవ్వడమే కాకుండా సింగర్ గా కూడా పాటలతో మెప్పిస్తున్నాడు అనిరుధ్.చూడాలి మరి బాలయ్య కు ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: