సోషల్ మీడియా వల్ల చాలామంది క్రేజ్ పెరగడమే కాకుండా సినిమాలలో అవకాశాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అలా ఇటీవలె గత రెండు రోజుల నుంచి కుంభమేళాలో ఒక్కసారిగా పాపులారిటీ అందుకున్నటువంటి మోనాలిసా పేరు గత మూడు నాలుగు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన ఈమె అందాన్ని చూసి చాలామంది ఫిదా అవుతున్నారు ముఖ్యంగా రుద్రాక్ష ముత్యాల హారాలతో అందరినీ ఆకట్టుకుంది మోనాలిసా. దీంతో ఒక్కసారిగా ఈమె పేరు మారుమోగిపోయింది.


ఈమెతో చాలామంది ఇంటర్వ్యూలు నిర్వహించడమే కాకుండా ఇప్పుడు సినిమా అవకాశాలను కూడా అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఒక బాలీవుడ్ డైరెక్టర్ అవకాశం ఇవ్వగా ఇప్పుడు తాజాగా తెలుగు హీరో చిత్రంలో కూడా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అది ఎవరో కాదు మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న RC -16 చిత్రంలో మోనాలిసా ఒక పాత్రను డైరెక్టర్ బుచ్చిబాబు ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే హీరోయిన్గా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేశారు. ఇప్పుడు మోనాలిసా ఎలాంటి క్యారెక్టర్ లో నటిస్తోందనే విషయంపై అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.


ముఖ్యంగా మోనాలిసా అందానికి ఆమె కళ్ళకి సైతం యూత్ బాగా ఫిదా అవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్లోనే నటిస్తూ ఉన్నారు.ఒకవేళ వినిపిస్తున్న సమాచారం ప్రకారం మోనాలిసాను రామ్ చరణ్ సినిమాలో తీసుకుంటే ఖచ్చితంగా ఈమెకు క్రేజ్ పెరుగుతుందని అభిమానులు దిమాని వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 27 నుంచి RC -16 కి సంబంధించి సెకండ్ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారట. అలాగే జూలైలో ఈ సినిమాని షూటింగ్ పూర్తి చేసి దసరాకి విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: