అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు పై లేటెస్ట్ కామెంట్స్ కొన్ని వైరల్ గా మారాయి .. సింగిల్ డిజిట్ దాటతమే కష్టం అవుతున్న వెంకటేష్ కెరియర్ కు డబల్ డిజిట్ అందిస్తూ అయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను ఇచ్చాడు అనిల్ .. అలాగే వెంకటేష్ సినిమాలో పాటలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలాగే చిరంజీవి సినిమాల్లో కూడా ఈ తరహా మెలోడీ సాంగ్స్ పెడితే ఎలా ఉంటుంది ? అలాంటి మెలోడీ సాంగ్స్ కి ఆయన గ్రేస్ యాడ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి డెఫినెట్గా బాక్సాఫీస్ కు దబిడి దిబిడే .. ఇంతే హార్డ్ వర్క్ అక్కడ కూడా పెడతా ప్రామిస్ అంటూ అనిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ..
ఇక దీంతో మెగా అభిమానులు ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇక మరి అనిల్ - చిరంజీవి తో చేసే సినిమా ఘరానా మొగుడు , గ్యాంగ్ లీడర్ సినిమా లాగా ఉంటుందని సినిమాపై మొదట నుంచి అంచనాలు పెంచేస్తున్నాడు .. ఇప్పుడు పాటలు విషయంలో కూడా అనిల్ చేసిన కామెంట్స్ తో చిరంజీవి సినిమా పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వెంకటేష్ , బాలకృష్ణ కు భారీ విజయాలు ఇచ్చిన అనిల్ రావిపూడి .. చిరంజీవికి ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి.