ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి పంపించారు. అయితే, సైఫ్‌ను కలిసేందుకు ఎవరినీ అనుమతించవద్దని, విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు మరీ మరీ తెలియజేశారు. ఇక దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
సైఫ్ చికిత్సకు సంబంధించిన హాస్పిటల్ బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐదు రోజుల చికిత్సకు ఏకంగా రూ.35,98,700 బిల్లు రావడంతో అందరూ షాక్ తిన్నారు. అంటే రోజుకు దాదాపు రూ.7 లక్షలు అన్నమాట. ఇంత భారీగా బిల్లులు వసూలు చేస్తున్న లగ్జరీ ఆసుపత్రులపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే సైఫ్‌కు నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటంతో, బిల్లులో ఎక్కువ భాగం ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అయిందని తెలుస్తోంది.
సైఫ్ తమ పాలసీదారుడని నివా బూపా ఇటీవలె వెల్లడించింది. "నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు అలా జరగడం చాలా బాధాకరం. అందుకు మేం చింతిస్తున్నాం. సైఫ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఆసుపత్రిలో చేరిన సమయంలోనే క్యాష్‌లెస్ ప్రీ-ఆథరైజేషన్ మాకు పంపారు. ఫైనల్ బిల్లులు అందిన తర్వాత, పాలసీ నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుగుతాయి." అని నివా బూపా సంస్థ తెలిపింది.
ఈ బిల్లు వైరల్ కావడంతో మెడికల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లపై చర్చ మొదలైంది. ప్రముఖ డాక్టర్లు దీనిపై మాట్లాడుతూ "ఫైవ్-స్టార్ హాస్పిటల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు వాటిని చెల్లిస్తున్నాయి. దీని వల్ల ప్రీమియంలు పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు దీని వల్ల చాలా నష్టపోతున్నారు." అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏది ఏమైనా ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ కోలుకుని ఇంటికి చేరుకోవడం అభిమానులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. కానీ, ఈ ఘటన వైద్యం ఎంత ఖరీదైనదో మరోసారి గుర్తు చేసింది.