తెలుగు సినిమా పరిశ్రమ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఎంతో మంది ముద్దుగుమ్మలు ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ సాలిడ్ గుర్తింపును , బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వారిలో సదా ఒకరు. ఈమె నితిన్ హీరో గా తేజ దర్శకత్వంలో రూపొందిన జయం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈమె పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో , అదే స్థాయి అందాలతో ఈ బ్యూటీ ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో అలరించింది.

సినిమా కూడా మంచి విజయం సాధించడంతో సదా కు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నుండి ఈ బ్యూటీ కి వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ.లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరో గా రూపొందిన అపరిచితుడు సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఈ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈమె క్రేజ్ ఒక్క సారిగా ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది. ఆ తర్వాత కూడా ఈ నటి టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగించింది. 

అలా కెరియర్ ను అద్భుతమైన స్థాయిలో స్థాయిలో చాలా సంవత్సరాలు కొనసాగించిన ఈ బ్యూటీ కి ఈ మధ్య కాలంలో అవకాశాలు చాలా వరకు తగ్గాయి. ఇకపోతే ఈమె వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా చాలా బిజీ అయిపోయింది. ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద క్రూర మృగాలను ఫోటోలను తీస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ బ్యూటీ పోస్ట్ చేస్తూ వస్తుంది. అలా వైల్డ్ ఫోటో గ్రాఫర్ గా ఈమె ఎక్కువ సమయాన్ని గడుపుతూ వస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: