తెలుగు సినిమా పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన కలియుగ పాండవులు అనే సినిమాతో కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా చాలా సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను , ఇండస్ట్రీ హిట్లను కూడా అందుకున్నాడు. ఇకపోతే తాజాగా వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ... ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి మూవీ లో హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే పైన వెంకటేష్ తో పాటు ఓ నటి ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆ బ్యూటీ ఇటు టాలీవుడ్ , కోలీవుడ్ రెండు ఇండస్ట్రీలలో కూడా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు ఈ రెండు ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఇప్పటికైనా పైన వెంకటేష్ తో పాటు ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన స్థాయిలో కెరియర్ను  కొనసాగించిన కుష్బూ. 

కపోతే కుష్బూ ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరీర్ను కొనసాగించింది. తన అందంతో , నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె వయస్సు 54 సంవత్సరాలు. ప్రస్తుతం కూడా కుష్బూ అనేక సినిమాలలో కీలక పాత్రలలో , ముఖ్యపాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగాను కెరీర్ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే వెంకటేష్ హీరోగా రూపొందిన మొదటి సినిమా కలియుగ పాండవుల్లో "కుష్బూ" హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: