ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మికా మందన్నా నేషనల్ క్రష్ గా మారిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సినిమాలతో గ్యాప్ లేకుండా వర్క్ చేస్తోంది. ఇక రీసెంట్ గా రష్మిక మందన్నా జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో తన కాలికి గాయమై కాలు బెణికింది అంటూ ఒక పోస్ట్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా తన కాలుకి తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది. కనీసం నడవలేని స్థితిలో రష్మిక మందన్నా పరిస్థితి తయారయింది. మరి ఇంతకీ రష్మికకు ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం.. రష్మికా మందన్నా ఓవైపు బాలీవుడ్ లో సికిందర్, చావా, థామా,అనిమల్ -2 సినిమాలతో పాటు తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాల్లో నటిస్తోంది. అయితే అలాంటి రష్మికా మందన్నా రీసెంట్ గా జిమ్ లో ఎక్సైజ్ చేస్తున్న సమయంలో తన కాలు బెణికింది.

అయితే రష్మిక మందన్నా మామూలు స్థితిలోకి రావడానికి కొద్ది రోజుల టైం పడుతుందని ఆమె ఒప్పుకున్న సినిమా ప్రాజెక్టులన్ని ఆగిపోయాయి. అయితే తాజాగా రష్మికా మందన్నా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించేది. అయితే ఆ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన రష్మికా మందన్న కారు నుండి దిగుతూ ఒకటే కాలు మీద కుంటుతూ వీల్ చైర్ దగ్గరికి వచ్చింది. కనీసం తన కాలు కింద పెట్టి నడిచే పరిస్థితి కూడా లేదు. కనిపించకుండా మొహం చుట్టూ క్యాప్ తో కవర్ చేసుకొని వీల్ చైర్ లో కూర్చుంది. వీల్ చైర్ లో ఆమె కూర్చుంటే ఆమె పక్కనే ఉన్న సిబ్బంది ఆమెను తోసుకుంటూ తీసుకువెళ్లారు.

కనీసం కాలు కింద పెట్టి నడవలేని పరిస్థితిలో వీల్ చైర్ కే పరిమితమైంది రష్మిక మందన్నా.ఇక ఈ కాలు బెణికిన గాయం నుండి రష్మిక మందన్నా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం కూడా పట్టొచ్చు అని తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం రష్మిక పరిస్థితి చూసి చాలామంది ఆమె అభిమానులు రష్మిక మందన్నా త్వరగా ఆ గాయం నుండి కోలుకొని మళ్లీ సినిమా షూటింగ్స్ లో పాల్గొనాలని కామెంట్స్ పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: