తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని ఆ తర్వాత కూడా వరుస పెట్టి విజయాలను అందుకున్న ముద్దుగుమ్మలు చాలా తక్కువ మంది ఉంటారు. పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో మాత్రమే కాకుండా ఆ తర్వాత నటించిన మరో రెండు సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకుంది.  టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈమె నటించిన మూడు సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి.

ఇప్పటి వరకు ఈమె తెలుగులో నాలుగు సినిమాలు చేస్తే అందులో ఒకే ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆ బ్యూటీ మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి సంయుక్తా మీనన్. ఈమె బీమ్లా నాయక్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా నటించగా ఈ సినిమాలో రానా కు భార్య పాత్రలో సంయుక్తా మీనన్ నటించింది. 

ఆ తర్వాత ఈమె సార్ , విరూపాక్ష సినిమాల్లో నటించి ఈ రెండు సినిమాలతో కూడా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంది. ఈమె కొంత కాలం క్రితం డెవిల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ తో పాటు పలు సినిమాలలో కూడా ఈమె నటిస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దు గుమ్మ చేతిలో ప్రస్తుతం కూడా అనేక తెలుగు సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: