తెలుగు సిని మా పరిశ్రమ లో అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుల లో వారిలో అనిల్ రావిపూడి ఒకరు . ఈయన పటాస్ అనే సినిమా తో దర్శకుడి గా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత దర్శకత్వం వహించిన సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవరు , ఎఫ్ 3 , భగవంత్ కేసరి తాజా గా దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వరుస విజయాలను అందుకొని తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించక ముందు చాలా సినిమాలకు కథ రచయితగా పని చేశాడు.

అనిల్ కథ రచయితగా పని చేసిన సినిమాలు కూడా చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం రామ్ పోతినేని హీరోగా కందిరీగ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాకు అనిల్ రావిపుడి కథ రచయితగా పని చేశాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన కందిరీగ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశారు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... కందిరీగ సినిమాలో సప్తగిరి ఓ చిన్న కామెడీ ట్రాక్ లో కనిపిస్తాడు. ఇక కందిరీగ సినిమాలో సప్తగిరి చేసిన కామిడీ ట్రాక్ నా కోసం రాసుకున్నది. నేనే ఆ పాత్రలో చేయాలి అనుకున్నాను. కానీ చివరి నిమిషంలో సప్తగిరి ఆ పాత్ర చేశాడు. ఆ కామెడీ ట్రాక్ అద్భుతంగా వర్కౌట్ అయింది అని అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: