ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే సక్సెస్ లు అందుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కసారి సక్సెస్ వచ్చిందంటే చాలు స్టార్ డం ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటుంది. హీరోల కంటే ముందుగా డైరెక్టర్లు సక్సెస్ అనేది చాలా కీలకమని చెప్పవచ్చు. గతంలో డైరెక్టర్లు తీసిన సినిమా ట్రాకులను బట్టి హీరోలు తమ చిత్రాలను ఎంచుకోవడం జరుగుతుంది. అయితే కొన్ని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కొంతమంది చిన్న డైరెక్టర్లు మరికొంతమంది పెద్ద డైరెక్టర్లు సైతం ప్రేక్షకుల ఆకట్టుకుంటూ ఉంటారు.


టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ప్రస్తుతం పేరు సంపాదించారు. ఈయన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అయ్యిందట. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, F2,f3, సంక్రాంతికి వస్తున్న ఇలాంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావుపూడి పలు విషయాలను పంచుకోవడం జరిగింది. దర్శకుడుగా తాను సంతృప్తి చెంది ఆడియన్స్ కూడా ఇక ఈ డైరెక్టర్ సినిమాలు చాలు అని ఫీలయ్యే వరకు తాను సినిమాలు తీస్తూ ఉంటానని తెలిపారు.


ఆ తర్వాత నటుడుగా మారిపోతానంటూ వెల్లడించారు. అయితే అది కూడా విలన్ పాత్రలో నటిస్తానని తెలిపారు .డైరెక్టర్ గా ఈయన చేసిన ప్రతి సినిమా కూడా విజయాన్ని అందుకున్నది.అందుకే ఈయనతో సినిమాలు చేసేందుకు సైతం స్టార్ హీరోలు సిద్ధమవుతూ ఉంటారు. దర్శకుడుగా కూడా బాగానే సంపాదించారట. హైదరాబాద్ సిటీ ఔట్స్కట్స్ లో కొన్ని ఎకరాలు కొన్నారని 10 ఎకరాల పైన ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే త్వరలోనే ఒక స్కూల్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట. అలాగే కారు, ఇల్లు, ఇతరత్రా బిజినెస్లలో కూడా అనిల్ రావుపూడి బాగానే సంపాదిస్తున్నారట. మొత్తానికి ఇండస్ట్రీలో పదేళ్లపాటు సక్సెస్ అందుకున్న డైరెక్టర్ గా పేరు పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: