ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమా దగ్గర నుంచి ప్రభాస్ స్పీడ్ పెంచాడు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా ప్రభాస్ స్పీడ్ ఎక్కడా తగ్గించలేదు. ఇక రీసెంట్ గా సలార్, కల్కి సినిమాతో వరుసగా పాన్ ఇండియా హిట్స్ అందుకున్నాడు.  ఇప్పుడు వరుసగా రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజా సాబ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు. హారర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. డిఫరెంట్ కథతో మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి. అలాగే ప్రభాస్ ఓల్డ్ లుక్ కూడా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో నిధి అగర్వాల్, తమిళ్ బ్యూటీ మాళవికామోహన్ జాయిన్ అయ్యారు.

ఇదిలా ఉంటే రాజాసాబ్‌ సినిమా సమ్మర్ బరిలో నుంచి దాదాపు తప్పుకుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అన్నది తెలియదు.సినిమాకు బ్యాలెన్స్ వర్క్ 20 రోజులకు పైనే ఉందని తెలుస్తోంది. వీటితోపాటు అదనంగా ప్యాచ్ వర్క్ కూడా ఉండనే ఉంటుంది. ఇక పాటలు కూడా షూట్ చేయాలి. ఏది ఏమైనా గ్యాప్ లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తే రెండు నెలలకు పైగా పని ఉంటుంది.ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు సీజీ పనులు ఉంటాయి. ఈ లెక్కన చూస్తే రాజాసాబ్‌ దసరా బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాదికి ప్రభాస్ సినిమా ఇది ఒక్కటే. హను రాఘవపూడి ఫౌజీ సినిమా షూట్ ఇప్పుడే ప్రారంభమైంది.అది రిలీజ్ కావాలంటే ఏడాది పడుతుంది. బాగా స్పాన్ ఉన్న కథ అది.. డిఫరెంట్ లొకేషన్ లో షూట్ చేయాలి. ఏది ఏమైనా రాజాసాబ్‌ సినిమా త్వరగా వస్తుందని ఆశించిన ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులకు నిరాశ తప్పడం లేదు.సమ్మర్లో వస్తుంది అనుకున్న సినిమా ఏకంగా దసరాకు వెళ్లిపోయింది. ఈ సినిమాకు ఏకంగా 200 కు పైగా వర్కింగ్ డేస్ అవసరమైనట్టు తెలుస్తుంది. ఇక దీని పైన క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వార్త విని ప్రభాస్ ఫ్యాన్స్  టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: