సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ప్రతి విషయాన్ని కూడా రాధాతం చేస్తూ హైలెట్గా మార్చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పై ..బిగ్ బడా పొలిటిషియన్స్ పై.. వాళ్ళ ఫ్యామిలీస్ పై ఎప్పుడూ ఒక కన్ను వేసే ఉంటారు ఆకతాయిలు. తాజాగా సోషల్ మీడియాలో అలాంటి వాళ్లకు అడ్డంగా దొరికిపోయింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి. అయితే ఆమె మాట్లాడిన మాటల్లో పెద్దగా బూతు అర్థం లేదు ..అందులో తప్పు కూడా లేదు కానీ కొంతమంది మాత్రం భువనేశ్వరి ఆ మాట అనడంపై ఫైర్ అవుతున్నారు . మనకు తెలిసిందే ప్రెసెంట్ బాలయ్య ఏ రేంజ్ లో ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడో.
అఖండ, వీరసింహారెడ్డి , భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫుల్ హిట్స్ అందుకొని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాడు . ప్రతిసారి కూడా తమన్ మ్యూజిక్ తో మోత మోగించేస్తున్నాడు. నందమూరి అభిమానులు అయితే మామూలు ఎలివేషన్ ఇవ్వడం లేదు . ఓ రేంజ్ లో కుమ్మి పడేస్తున్నాడు అని ఇండస్ట్రీలో తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లేరు అంటూ పొగిడేస్తున్నారు. కొన్ని సందర్భాలలో బాలకృష్ణ.. ఎస్ ఎస్ తమన్ కాదు నందమూరి తమన్ అంటూ కొనియాడారు . అయితే బాలకృష్ణ ఆ మాట అనడం పట్ల పెద్దగా జనాలు నెగిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు .
కానీ రీసెంట్గా ఓ ఈవెంట్లో భువనేశ్వరి.. నందమూరి తమన్ అంటూ ప్రస్తావించడం పై మాత్రం ఫైర్ అయిపోతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా నైట్ జరగబోతుంది . ఆ రోజు తమన్ అలాగే ఆయన టీం మ్యూజికల్ నైట్ నిర్వహించబోతున్నారు . దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి మరి అనౌన్స్ చేశారు . ఈ ప్రెస్ మీట్ లోనే భువనేశ్వరితో పాటు తమన్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ భువనేశ్వరి .. నందమూరి తమన్ అంటూ వ్యాఖ్యానించారు.
అయితే ఇక్కడ ఒక సెక్షన్ ఆఫర్ నందమూరి ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు . అదేంటి నందమూరి తమన్ అంటూ అలా మాట్లాడడం కరెక్టేనా..? అంటూ ఫైర్ అవుతున్నారు . మరీ ముఖ్యంగా నందమూరి అన్న ఇంటి పేరుకి ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంది అని.. ఇలా ఎవరికి పడితే వాళ్లకి నందమూరి అన్న ఇంటిపేరు ఇచ్చేస్తారా..? అంటూ కూడా ఫైర్ అయిపోతున్నారు. అయితే అయితే మరి కొంతమంది నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకున్నారు .
కాగా ఈ మ్యూజికల్ నైట్ ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం తల సేమియా బాధితుల కోసం ఉపయోగించబోతున్నట్లు ..అలాగే మెడికల్ క్యాంపు నిర్వహించబోతున్నట్లు భువనేశ్వరి వెల్లడించారు. ఇలాంటి ఒక కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు తమన్ పేరే గుర్తుకు వచ్చింది అంటూ చెప్పిన భువనేశ్వరి ..వెంటనే సారీ సారీ తమన్ కాదు నందమూరి తమన్ అనడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరిసాయి . అంతేకాదు తమన్ సైతం సిగ్గుపడిపోతూ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది..!