తెలుగు సినీ ఇండస్ట్రీలో నిన్నటి రోజు నుంచి ఎక్కువగా ఐటీ దాడులు ఒక్కసారిగా కలకలాన్ని రేపుతున్నాయి.. ప్రముఖ నిర్మాణ సంస్థల ఆఫీసులు అలాగే నిర్మాతల ఇళ్ల పైన కూడా ఐటీ అధికారులు ఒక్కసారిగా ఏకకాలంలోనే దాడులు చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు కేవలం ప్రొడ్యూసర్స్, ఫైనాన్స్ మాత్రమే ఇలాంటి ఐటీ దాడులు జరగగా ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ మీద కూడా ఐటి రైడ్స్ నిర్వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటి గురించి పూర్తి విషయాలు చూద్దాం.



తాజాగా మీడియా నివేదికల ప్రకారం డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో నిన్నటి ఉదయం నుంచే ఐటీ సోదాలు ఎక్కువగా జరుగుతున్నాయట. డైరెక్టర్ సుకుమార్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా మధ్య దారిలోనే నేరుగా తన ఇంటికి తీసుకువెళ్లి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పరిశీలించారట ఐటీ అధికారులు. పుష్ప 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుకుమార్సినిమా నిర్మాణంలో తన నిర్ణయం కూడా భాగస్వామిగా చేయడం జరిగింది. దీనివల్లే ఐడి రైడ్స్ నిర్వహించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇప్పటివరకు పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1850 కోట్ల రూపాయలకు మాత్రమే రాబట్టింది. ఐటి అధికారులు కూడా రైడ్స్ చేయడానికి ముఖ్య కారణం ఇదే అన్నట్లుగా టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ ఆఫీస్ నిర్మాతలతో పాటు వారి యొక్క ఇళ్లలో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే పుష్ప 2 చిత్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఐటి శాఖ అధికారులు టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మ్యాంగో మీడియా అధినేత అభిషేక అగర్వాల్తో సహా పలువురు అగ్ర నిర్మాతల ఇళ్ల పైన కూడా ఐటీ సోదరులు జరిపారు. మరి రాబోయే రోజుల్లో ఎవరెవరు పైన ఇంకా ఐటీ దాడులు కొనసాగుతాయి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: