మెగా హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది.దీంతో బాక్సఫీస్ వద్ద అనుకున్న కలెక్షన్లు రాబట్టలేక పోయింది. ఈ సినిమా రూ.220 కోట్లకు ప్రీరిలీజ్ చేసింది.అయితే,బ్రేక్ ఈవెను కోసం మరో రూ.222 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ 11 రోజులు వ్యవధిలో రూ.127.15 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే మరో రూ.130 కోట్లకి పైగా షేర్ ను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.ఈ క్రమంలోనే తాజాగా 'గేమ్ ఛేంజర్' మూవీ ఓటీటీలో ఎప్పుడు అందుబాటులోకి రాబోతుందనే సమాచారం వచ్చేసింది.విజనరీ డైరెక్టర్ శంకర్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం 'గేమ్ ఛేంజర్'. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే మూవీ రిలీజ్ కి ముందు నుంచే ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 'గేమ్ ఛేంజర్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. కాబట్టి ఈ మూవీ ఫిబ్రవరి రెండో వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోందని తెలుస్తోంది. తాజా బజ్ ప్రకారం ఫిబ్రవరి 14న గేమ్ ఛేంజర్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు. ఏదేమైనా మెగా అభిమానులు మాత్రం మూవీ ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: