అదే విధంగా పుష్ప 2 మూవీ మేకర్స్ మైత్రి మూవీ సంస్థ పై కూడా ఐటి రైడ్స్ నిర్వహించినట్లు తెలుస్తుంది . అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది . గేమ్ ఛేంజర్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్న రామ్ చరణ్ ఇంట్లో నెక్స్ట్ ఐడి రైడ్స్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఒకపక్క మెగాస్టార్ ఇంకొకపక్క అపోలో హాస్పిటల్స్ రెండు ఆయనకు బాగానే కలిసి వచ్చాయి.
ఇప్పుడు రామ్ చరణ్ ఆస్తి వేలకోట్లలోనే ఉంది . అంతే కాదు గేమ్ ఛేంజర్ సినిమాకి దాదాపు 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. దీంతో ఆయన పై నెగిటివ్ ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఇదే మూమెంట్లో నెక్స్ట్ రాంచరణ్ ఇంట్లో ఐటి రైడ్స్ జరగబోతున్నాయి అన్న వార్త సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాయి . అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియనప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్తను బాగా హైలెట్ చేస్తున్నారు కొంతమంది జనాలు. అయితే మరి కొంత మంది మాత్రం ఈ న్యూస్ పై నెగిటివ్ గా స్పందిస్తున్నారు..!