అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య మూడు తరాల వారసులు అక్కినేని కుటుంబాన్ని గొప్ప స్థాయిలో ఉంచుతున్నారు. అంతేకాకుండా భారీగా డబ్బులను సంపాదిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. కాగా అక్కినేని నాగచైతన్య కొద్ది రోజుల క్రితమే శోభితను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.


వివాహం తర్వాత నాగచైతన్య, శోభిత సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటున్నారు. షూటింగ్ అయిపోయినా అనంతరం వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. మరి శోభిత ఎప్పటిలానే సినిమాలలో నటిస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ విషయంపై ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ ఈ వార్తలపై శోభిత ఇంతవరకు స్పందించలేదు.


కాగా, వివాహం తర్వాత నాగచైతన్య తన భార్య శోభితతో కలిసి నాగార్జున ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబంలో పెళ్లయిన కొద్ది రోజులకే కొత్త పంచాయతీ ప్రారంభమైందట. ఈ విషయం వల్ల నాగచైతన్య చాలా బాధపడుతున్నారట. అయితే శోభిత వేరు కాపురం పెడదామని నాగచైతన్యను టార్చర్ పెడుతుందట. కానీ చైతన్య వేరు కాపురం పెట్టడం అసలు ఇష్టం లేదట.


అమ్మ, నాన్నతో కలిసి ఇంట్లోనే ఉందామని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడట. కానీ తన మాట వినకుండా శోభిత చాలా గొడవ చేస్తుందట. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. వీరిద్దరిని బయటకి పంపిస్తారా లేదా తన ఇంట్లోనే ఉంచుకుంటారా అనే సందేహం చాలా మందిలో ఉంది. పెళ్లయిన కొద్ది రోజులకి శోభిత ఇలా చేయడంతో అక్కినేని కుటుంబంలో ప్రశాంతత లేకుండా పోయిందట. ప్రతిరోజు ఇదే విషయం గురించి గొడవ జరుగుతుందట. మరి శోభిత తన నిర్ణయాన్ని మార్చుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: