దివంగత నటుడు రఘువరన్ అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు.ఈయన విలన్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.కేవలం విలన్ గానే కాకుండా సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలో తన నటనతో అదరగొట్టారని చెప్పుకోవచ్చు.అయితే అలాంటి రఘువరన్ డ్రగ్స్ కి మద్యపానానికి బానిసై మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన మరణానికి కారణం కన్న కొడుకే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘువరన్ బావమరిది నటుడు బాలాజీ.. బాలాజీ అనే పేరు చెప్తే ఎవరూ గుర్తుపట్టకపోయినప్పటికీ ఈయన ఫేస్ చూస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఎందుకంటే ఈయన ఒకప్పుడు సినిమాల్లో నటించారు. కానీ ప్రస్తుతం బుల్లితెర మీద పలు సీరియల్స్ లో ఆకట్టుకుంటున్నారు. అయితే అలాంటి బాలాజీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..విలన్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రఘువరన్ నా సొంత బావ.

ఎందుకంటే హీరోయిన్ రోహిణి నా సొంత చెల్లెలు.. రోహిణి సినిమాల్లోకి పంపించిన సమయంలో మా నాన్న ఎంతో కష్టపడ్డారు. రోహిణి సినిమాల్లోకి వచ్చాకే నేను సినిమాల్లోకి వచ్చాను.ఇక రోహిణి అంటే నాకు ప్రాణం.. అలాగే రోహిణి రఘువరన్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీరు వీడిపోకుండా ఉండడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ ఈ విడాకుల విషయంలో ఇద్దరి తప్పు ఉంది.. రఘువరన్ ఎంత చెప్పినా కూడా వ్యసనాన్ని వదులుకోలేదు. అలా రఘువరన్ తో పాటు నా చెల్లి రోహిణి కూడా తగ్గలేదు. నా చెల్లి రోహిణి చాలా మొండి పట్టుగలది.ఏ విషయమైనా తనదే నెగ్గాలి అంటూ ఉంటుంది.అందుకే వీరి మధ్య గొడవలు వచ్చి చివరికి విడాకులు తీసుకున్నారు.అయితే మొదట్లో గొడవ జరిగిన సమయంలో ఇద్దరు మాట్లాడుకొని మళ్లీ గొడవలు పెట్టుకోమని తిరుమల సాక్షిగా అనుకున్నారు.కానీ ఆ తర్వాత మళ్లీ గొడవలు వచ్చాయి.

ఇక రఘువరన్ చనిపోవడానికి మెయిన్ కారణం డ్రగ్స్ కి బానిసవ్వడం అంటారు.కానీ ఆయన చనిపోవడానికి మరో కారణం కూడా ఉంది. ఆయన కన్న కొడుకే..ఎందుకంటే రక్తం పంచుకొని పుట్టిన కొడుకు తన దగ్గర లేకపోవడంతో రఘువరన్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆ బాధలో మరింత ఎక్కువ తాగి చివరికి మరణించారు. ఇక ఆయన హాస్పిటల్ లో ఉన్న సమయంలో నేను వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడిగితే నువ్వు ఎవరు నన్ను అడగడానికి నువ్వేమైనా రజినీకాంత్ వా అని నన్ను అడిగారు. నేను నీ బామ్మర్దిని అని చెప్పడంతోనే రఘువరన్ నవ్వి చనిపోయే వరకు కూడా నాతో బాగా మాట్లాడారు.ఇక ఆయన చనిపోయే స్టేజ్ లో ఉన్న సమయంలో రోహిణి మళ్లీ రఘువరన్ దగ్గరికి వెళ్లి అన్ని తానై చూసుకుంది.ఎన్నో సేవలు చేసినప్పటికీ రఘువరన్ ని కాపాడుకోలేకపోయింది అంటూ నటుడు బాలాజీ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: