ఈ క్రమంలో పుష్ప 2 ఓటీటీపై పలు వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.పుష్ప 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. సుమారు రూ.250 కోట్లకు హక్కులను దక్కించుకుంది. ఈ విషయంలోనూ పుష్ప 2 రికార్డు సాధించింది. థియేటర్లలోనూ అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. రిలీజైన 56 రోజుల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని మూవీ టీమ్ ఇటీవల చెప్పింది.ఈ క్రమంలోనే ఈ నెల 29లేదా 31న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం.దీంతో ఆరోజు స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ఫిక్స్ అయిందని తాజాగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం 3గంటల 40నిమిషాల నిడివి తో వున్నా రీ లోడెడ్ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శిస్తుండగా ఓటీటీ లోను ఇదే వెర్షన్ నే రిలీజ్ చేసే అవకాశముంది.ఇక ప్రతీ మైలురాయికి రికార్డుల మోతతో అదరగొడుతోంది పుష్ప 2.