ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన నటించింది. పహాద్ ఫాజిల్ విలన్ పాత్రను పోషించాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తితో ఈ సినిమాను చూస్తున్నారు. ఈ సినిమా విడుదలై రెండు నెలలు కావస్తోంది. అయినప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా థియేటర్లలో నడుస్తోంది. కాగా, పుష్ప-2 సినిమా 50 రోజుల సెలబ్రేషన్స్ ని నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తోందట.
ఈ ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహించాలని అనుకుంటున్నారట. దీనికి చంద్రబాబు పర్మిషన్ ఇస్తారో లేదో అనే సందిగ్ధంలో చిత్రబృందం ఉన్నారట. ఇదిలా ఉండగా.... డైరెక్టర్ కొరటాల శివ దేవర సినిమాతో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ తన తదుపరి సినిమాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి తీయాలని ప్లాన్ లో ఉన్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథను కూడా సిద్ధం చేసుకున్నారట.
కొరటాల శివ ఈ సినిమాను అడవి చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. దేవర సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కొరటాల శివ అల్లు అర్జున్ తో ఏ విధంగా సినిమా తీస్తారో చూడాలని అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ను సెలెక్ట్ చేసే పనిలో కొరటాల శివ ఉన్నారట. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.