నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గత 2023 సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెర్కక్కించిన ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు .. అలాగే ఈ సినిమాలో బాలయ్యకు జంటగా హనీ రోజ్ , శృతిహాసన్ హీరోయిన్లుగా నటించి అదరగొట్టారు .. ఇదే క్రమంలో ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ నటించారు. దునియా విజయ్ కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో .. ఆ ఇండస్ట్రీలో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మప్పించారు ..


క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన సినీ కెరియర్ ప్రారంభించిన దునియా విజయ్ 2007లో వచ్చిన దునియా సినిమాతో ఒక్కసారిగా భారీ గుర్తింపు తెచ్చుకున్నారు .. దీంతో ఈ సినిమా దగ్గరనుంచి ఆయన కెరియర్ ఊహించిన విధంగా మ‌రిపోయింది .. అక్క‌డ నూంచి దునియా విజయ్ గా కన్నడ చిత్ర పరిశ్రమలో వ‌రుస‌ సినిమాలు చేసుకుంటూ పోయాడు .. ఇదే క్రమంలో వీర సింహారెడ్డి సినిమాతో తెలుగులోకి విలన్ గా అడుగుపెట్టారు .. అయితే ఇప్పుడు ఈ కన్నడ స్టార్ దునియా విజయ్ కి సంబంధించిన ఓ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. అయితే అసలు విషయం ఏమిటంటే దునియా విజయ్ కూతురుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లు తెగ హల్చల్ చేస్తున్నాయి.


ఈ స్టార్ హీరోకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.  వారిలో ఇద్దరు కూతుర్లు.. ఒక కొడుకు.. మోనిష విజయ్, మోనికా విజయ్, అలాగే కొడుకు పేరు సామ్రాట్ విజయ్ .. అయితే వీరులో మోనిషా విజయ్ హీరోయిన్గా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు తాజాగా మోనిషకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. అందులో మోనిష  తన అందంతో యూత్ ను కట్టిబడిస్తుంది .. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ప్రెసెంట్ ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారడంతో ఈమె టాలీవుడ్‌ లో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని ఆమె ఫోటోలకు  క్రేజీ కామెంట్లు పెడుతూ నేటిజల్లు వాటిని వైరల్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: