గత 2023 సంక్రాంతికి నట‌సింహం నందమూరి బాలకృష్ణకు వీర సింహారెడ్డి తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని మరోసారి బాలయ్య తో కలిసి సినిమా చేయబోతున్నాడు .. త్వరలోనే ఈ సినిమాపై అధికార ప్రకటన కూడా బయటకు రానుంది .. అలాగే ఈ కాంబోలో మరోసారి సినిమా రావాలని అభిమానులు కూడా ఎంతగానో కోరుకుంటున్నారు .. రవితేజ తో సినిమా మిస్సయ్యాక బాలీవుడ్ హీరో సన్నీ డ్యూయల్ తో జాత్‌ చేస్తున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి .. మరోపక్క బాలయ్య అఖంఢ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాడు .  వచ్చే సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అధికారుకంగా ప్రకటన కూడా ఇచ్చేశారు .  రిలీజ్ డేట్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శరవేగంగా బాలయ్య షూటింగ్ డేట్లు కూడా ఇచ్చేశాడు.


అయితే ఎప్పుడు  అసలు కిక్ ఇచ్చే మ్యాటర్ ఏమిటంటే .. బాలకృష్ణ - గోపీచంద్ మల్లినేని సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించబోతున్నట్లు టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం .. గతంలో దేవరకు అదిరిపోయే పాటలు , బిజిఎం , చూశాక బాలయ్య కి కూడా అనిరుధ్ త‌మ హీరోకి కూడా పని చేస్తే బాగుంటుందని అభిమానులు తెగ కోరుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ జైలర్‌ను తన మ్యూజిక్ తో ఎలివేట్ చేసిన విధానం దాని సక్సెస్ లో ఎంతో కీలకపాత్ర పోషించింది. అలాంటిది మాస్‌ సినిమాలకి గాడ్ ఆఫ్ మాస‌స్ అయిన బాలయ్యకు ఎలాంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు కొత్తగా చెప్పక్కర్లేదు .. ఈ సినిమాను ఓ అగ్ర నిర్మాణ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో తెర్కక్కించడానికి ప్లానింగ్ లో ఉంది .


బ్యాక్ టు బ్యాక్ నాలుగు విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ఇకపై కూడా అదే దూకుడు కొనసాగించే పనిలో ఉన్నాడు .  అఖండ2 తర్వాత గోపీచంద్ మలినేని సినిమా ఆ తర్వాత ఆదిత్య 999  పనులు మొదలు పెట్టబోతున్నాడు .. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ కావడంతో ఈ స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు . అదేవిధంగా ఈ సినిమాల్లో మోక్షజ్ఞ హీరోగా తాను ప్రధాన పాత్రతో పాటు తానే  దర్శకత్వం వహించే బాధ్యతను కూడా తీసుకోబోతున్నారు బాలయ్య. దీనికి సంబంధించిన హింట్స్ కూడా బాలయ్య గతంలో అన్ స్టాపబుల్ 4 షోలో ఇచ్చేశాడు.  ప్రజెంట్ డాకు మహారాజ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: