నాగార్జున ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో.. ఇప్పుడు సీనియర్ హీరో.. అయితే నాగార్జున ఈ మధ్యకాలంలో హిట్స్ అందుకున్నిందే లేదు. ఆయన లాస్ట్ గా హిట్ అందుకుంది బంగార్రాజు.  ఈ సినిమాతోనే ఆయన లాస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.  ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కూడా నటించాడు . కృతి శెట్టి హీరోయిన్గా నటించింది . అలాగే రమ్యకృష్ణ కూడా హీరోయిన్గా నటించింది . ఈ సినిమా తర్వాత నాగార్జున కొన్ని సినిమాలల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు మొత్తం ఫ్లాప్ అయ్యాయి.
 

ఆయనకు అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేకపోయాయి . అయితే గత ఏడాది వచ్చిన "నా స్వామి రంగా" సినిమా హిట్ అవుతుంది అంటూ బాగా ఆశపడ్డారు . అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిన కూడా నాగార్జున లెవెల్ హిట్ కాలేకపోయింది . ఇప్పుడు నాగార్జున తన వందవ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.  ఈ సినిమాతో నైనా ఆయన ఒక్క హిట్ తన ఖాతాలో వేసుకుంటాడు అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.  అయితే సీనియర్ హీరోస్ లలో చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ తమ మార్కెట్ ను మళ్లీ స్టాండర్డ్ గా దక్కించుకునేసారు .



చిరంజీవి మార్కెట్ ఎప్పుడూ కూడా స్టాండర్డ్ గానే ఉంటుంది . అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా ఆయన లెవెల్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది . రీసెంట్ గానే బాలకృష్ణ ..అఖండ సినిమా తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటు ఫామ్ లోకి వచ్చేసారు. డాకు మహా రాజ్ సినిమాతో ఏ లెవల్ హిట్ అందుకున్నాడో మనకు తెలిసిందే.  ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన "సంక్రాంతి వస్తున్నాం" సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ ఫామ్ లోకి వచ్చాడు విక్టరీ వెంకటేష్ . ఇక సీనియర్ హీరోస్ లల్లో హిట్టు కొట్టాల్సిన బాధ్యత నాగార్జునపై ఉంది . ఆయన ఒక్కరు తప్పిస్తే మిగతా అందరూ కూడా మార్కెట్ ప్రకారం బాగానే క్రేజ్ సంపాదించుకునేసారు . నాగార్జునకి ఆ లోటు ఎప్పుడు తీరుతుందో అంటూ వెయిట్ చేస్తున్నారు . ఆయన తన వందవ సినిమాతో ఆ కోరిక తీర్చేసుకుంటాడు అంటున్నారు జనాలు . చూద్దాం ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: