- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


ఇటీవల మన తెలుగు సినిమాలు పాన్ ఇండియానే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. మన తెలుగు సినిమాలలో చాలావరకు జపాన్, చైనా లాంటి దేశాలలో బాగా ఆడుతున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమాకు ఆ దేశాలలో ఎలాంటి ఆదరణ దక్కిందో చూసాం. ఏడాది పాటు ఆడింది. నెలల తరబడి షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. అలాగే అన్ని సినిమాలు హిట్లు కొడతాయి అన్న గ్యారెంటీ లేదు. దానికి నిదర్శనం తాజాగా వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా. కల్కి సినిమా మనదేశంలోనూ.. అమెరికాలాంటి దేశాలలో సూపర్ డూపర్ హిట్ అయింది.


సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను జనవరి 3న భారీగా జపాన్ ధియేటర్లలో రిలీజ్ చేశారు. అస్వస్థత వల్ల ప్రభాస్ అక్కడికి వెళ్లలేదు. కానీ.. దర్శకుడు నాగ్ అశ్విన్‌ స్పెషల్‌గా హాజరై మరీ ప్రమోషన్లు చేసుకున్నారు. ఫాంటసీ ఫిక్షన్ కావడంతో అక్కడ ప్రేక్షకులను మెప్పిస్తుందని ధీమా టీంలో ఉంది. కానీ విచిత్రం ఏంటంటే.. కల్కి సినిమాను జపాన్ సినీ ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఈ సినిమా భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం ఓపెనింగ్స్‌లో కేవలం రూ.45 లక్షలు మాత్రమే సాధించింది.


ఆ తర్వాత ఆ ఊపు కొనసాగించలేదు. మొదటివారం తిరిగే లోపు రెండు కోట్ల లోపు వసూళ్లతో ఆగిపోవడంతో.. థియేటర్ ర‌న్ ముగించాల్సి వచ్చింది. దీనికి కారణం కల్కి సినిమాలో ఉన్న అశ్వద్ధామ, కర్ణుడు, శ్రీకృష్ణుడు లాంటి పాత్రలు. మైథ‌లాజికల్‌గా మనకు కనెక్ట్ అయినంతగా.. జపాన్ జనాలకు ఎక్కలేదు. అందులో పాత్రల మధ్య సంబంధం అర్థం అయితే తప్ప సినిమాను ఆస్వాదించలేరు. దీంతో సహజంగానే కల్కి సినిమాకు జపాన్‌లో అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కలేదని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: