- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్టు తెలుస్తోంది. ఆయనకు వారసత్వంగా రావాల్సిన రూ.15 వేల కోట్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. సైఫ్ రాజవంశానికి చెందిన వారసుడు అన్న విషయం తెలిసిందే. అయితే దేశ విభజన సమయంలో సైఫ్ ముత్తమ్మ‌మ్మ అబిదా సుల్తాన్ భారతదేశం విడిచి పాకిస్తాన్ వెళ్ళిపోయారు. అయితే ఎనిమి చట్టం ప్రకారం.. ఎవరైతే దేశం వ‌దిలి వెళ్లిపోయారో.. వారి ఆస్తి స్థానిక ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని.. భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది.


అబిదా సుల్తాన్ వదిలి వెళ్లిన రూ.15వేల కోట్ల ఆస్తిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొనుంది. గతంలో ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ ఈ ఆస్తి తమకే చెందుతుందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం అప్పట్లో స్టే ఇచ్చినా దీనిని గత ఏడాది డిసెంబర్‌లో భూపాల్ హైకోర్టు ఎత్తివేసింది. ఈ స్టే ఎత్తివేసిన 30 రోజులలో మరో అపీల్‌ చేసుకోవచ్చు. కానీ సైఫ్ కుటుంబం నుంచి ఎవరు అపీలు చేసుకోలేదు. అలా చూస్తూ చూస్తూ రూ.15 వేల కోట్ల వంశ సంపదని ఎవరు.. ఇంత ఈజీగా వదులుకుంటారా ? అనే చర్చలు కూడా దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.


మరి ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏమైనా పోరాటం చేస్తారా.. లేదా ? అన్నది చూడాల్సి ఉంది. ఇక ఇటీవ‌ల సైఫ్ ఆలీఖాన్‌పై ఓ దుండ‌గుడు స్వయంగా ఇంటి లోపలికి వెళ్లి మరీ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రీట్మెంట్కు అక్షరాల రూ.36 లక్షల బిల్ అయినట్టుగా.. అది లీలావతి హాస్పిటల్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఓ బిల్ వైరల్ అవుతుంది. అంటే ఐదు రోజులకు దాదాపు రూ.36 లక్షల బిల్ అయింది అన్నమాట. ఈ బిల్లు మొత్తంలో రూ.25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై చేసినట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: