టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్‌లో మరోసారి అద్భుతమైన విజయాన్ని సాధించి.. బాక్సాఫీస్ వద్ద న్యూ రికార్డులు క్రియేట్ చేస్తోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఈ సినిమాతో ప్రేక్షకులను థియేటర్లకు నాన్ స్టాప్‌గా రప్పిస్తున్నారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి స్పందన అందుకుని అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద తన డామినేషన్ చూపిస్తోంది. సాధారణంగా సెలవులు ముగిశాక సంక్రాంతి సినిమాలకు కొంత క్రేజ్ తగ్గే అవకాశం ఉంటుంది.
కానీ.. ఈ సినిమాకు అందుకు భిన్నంగా వీకెండ్ తర్వాత కూడా అదే స్థాయిలో థియేటర్‌లు ఫుల్ అవుతున్నాయి. కేవలం ఎనిమిది రోజులలో సంక్రాంతి వస్తున్నాం సినిమా రూ.218 కోట్ల గ్రస్ వసూళ్లు సాధించడం న్యూ రికార్డు అని చెప్పాలి. చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమా భారీ అంచనాలను మించి.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వారాంతంలోనే ఈ సినిమా రూ.250 కోట్ల మార్కు దాటుతుందని ఫైనల్ రన్ ముగిసేసరికి రూ.300కు పైగా కోట్ల వసూళ్లు కొల్లగొడుతుందని చెబుతున్నారు.
నార్త్ అమెరికాలో ఇప్పటికే $ 2.5 మిలియన్ మార్క్‌కు చేరుకున్న ఈ చిత్రం, త్వరలో $ 3 మిలియన్ మార్క్ ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నారు. వెంకటేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్‌తో వచ్చిన ఈ హిట్ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడిగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించగా.. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. కేవలం రూ.30 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా.. ఎప్పటికే దాదాపు రూ.120 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది.