అలాగే సత్యా రంగయ్య ఫైనాన్సు రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు . నటరత్న ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ కాలం నుంచి ఇప్పటివరకు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో ఈయన లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి .. ప్రధానంగా దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ , యూవి క్రియేషన్స్ వంటి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలకు దాదాపు 2.25% వడ్డీతో డబ్బులు ఇవ్వడం ఈయనకున్న ప్రత్యేకత .. అలాగే మన టాలీవుడ్ లో ఐదు రూపాయల నుంచి పది రూపాయలకు వడ్డీకి ఇచ్చేవారు కూడా కొందరు ఉన్నారు .. కానీ వారిలో దాదాపు అందరికంటే అతి తక్కువ వడ్డీకి రంగయ్యే డబ్బులు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ సత్యం రంగయ్య వ్యాపారాన్ని కొడుకు ఎంఎస్ఆర్ ప్రసాద్ ముందుకు తీసుకు వెళ్తున్నాడు .. పెద్దపెద్ద సినిమాలకు కీలకమైన సమయాల్లో అవసరమైన ఫైనాన్స్ అందించడంలో రంగయ్య పేరు పరిశ్రమలో ముందు వరుసలో ఉంటుంది ..
అయితే టెక్నాలజీ పెరగ ముందు గతంలో ల్యాబ్ లెటర్స్ ద్వారా ఈ ఫైనాన్స్ లావాదేవీలు జరుగుతూ ఉండేవి . కానీ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఫైనాన్స్ ఇవ్వటం కూడా పూర్తిగా మారిపోయింది .. ఇక్కడ కూడా ఓటీటీ అగ్రిమెంట్లు, హిందీ మార్కెట్ డీల్ ప్రధాన ఆధారాలుగా మారాయి .. ఇవన్నీ పక్కనపెట్టి దర్శక నిర్మాతల ఆర్థిక స్థితిని పరిశీలించి వారి బ్యాంకింగ్ వివరాలు తెలుసుకున్న తర్వాతే ఫైనాన్స్ అందించటం జరుగుతుంది. ఈ వ్యవహారంతో టాలీవుడ్ పారదర్శకత్వం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు . ఇక గేమ్ చేంజర్ , సంక్రాంతికి వస్తున్న వంటి పెద్ద పెద్ద సినిమాలకు సత్యం రంగయ్య కీలకమైన ఫైనాన్సు అందించినట్టు తెలుస్తుంది .. అయితే ఇప్పుడు ఈ లావాదేవీల పట్ల ఆదాయపు పన్ను శాఖ భారీ స్థాయిలో విచారణ జరుపుతుంది . నగదు లావాదేవీలు జరిగాయ ? పన్ను చెల్లింపులు కరెక్ట్ గా ఉన్నాయా ? అన్ని రకాల కోణంలో ఈడి , ఐటీ అధికారులు పూర్తిస్థాయిలో సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు.