ఇటీవలె యానిమల్ సినిమా డైరెక్టర్ కూడా ఈ విషయాన్ని అడగగా తాను కూడా ఆలోచిస్తున్నానని తెలిపారు వర్మ. తాజాగా వర్మ ఒక ప్లానింగ్ తో ఉన్నారని అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో మూడు నాలుగు సినిమాలు చేసిన వర్మ నెక్స్ట్ సినిమా కూడా ఆయనతో చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఈ మార్కు కాంబో సినిమా తీస్తే కచ్చితంగా వర్మ మళ్ళీ తిరిగి గెట్టిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాంగోపాల్ వర్మ ఫర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అన్నట్టు అభిమానులు తెలుపుతున్నారు. మరి ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందా రాదా అనే విషయం పైన వర్మ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. రాంగోపాల్ వర్మ మనసుపెట్టి ఏదైనా సినిమా మొదలు పెడితే మాత్రం గొప్ప గొప్ప కథలతో సినిమాలు చేస్తారని నమ్మకం చాలా మంది డైరెక్టర్లలో ఉన్నది. చాలామంది డైరెక్టర్లు వర్మ దగ్గర శిష్యులుగా చేసిన వారి ఇండస్ట్రీలో ఎక్కువమంది ఉన్నారు.