నటసింహం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ చిత్ర పరిశ్రమలో పౌరాణికం , జానపదం, సైన్స్ ఫిక్షన్ ,బయోపిక్ ఇలా అన్ని రకాల జానర్ల‌ సినిమాలు చేసిన ఏకైక స్టార్ హీరోగా బాలయ్య నిలిచాడు .. అలాగే 1987లో బాలకృష్ణ హీరోగా 8 సినిమాలను ఒకేసారి విడుదల చేశారు .. అలాగే ఈ రిలీజైన 8 సినిమాలు అప్పట్లో మంచి విజయం సాధించి అరుదైన ఘనతను తన ఖాతాలు వేసుకున్నాడు బాలయ్య. అలాగే నరసింహనాయుడు , సింహా , లెజెండ్ సినిమాలకు మూడు నంది .. అలాగే లెజెండ్ కు సైమా ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. అలాగే బాలకృష్ణ కెరియర్లో ఎక్కువగా దర్శకుడు కోదండరామిరెడ్డి తో 13 సినిమాలో నటించారు ..


అలాగే ఆయన కెరియర్ లో 17 సినిమాల్లో డ్య‌యాల్ రోల్‌లో కనిపించారు .. అలాగే అధినాయకుడు సినిమాలో ట్రిపుల్ రోల్ కూడా చేశారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో అత్యధిక గెటప్పుల్లో నటించారు .. ఇదే క్రమంలో చంఘీజ్‌ ఖాన్, గోన గన్నారెడ్డి, రామానుజ చార్య, బాలకృష్ణకు ఇష్టమైన డ్రీమ్ రోల్స్ .. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎప్పుడు చెయ్యని ఎక్కువ కసరతులు తన 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి కోసం బాలయ్య చేశారు. అలాగే తన 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతో ఉత్సాహంగా నటించిన సినిమా పూరి జగన్నాథ్ తెర్కక్కించిన పైసా వసూల్. అలాగే బాలకృష్ణ తన సినీ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక రీమిక్‌ సినిమా కూడా చేయలేదు .


అలాగే బాలకృష్ణ హీరోగా చేసిన 71 సినిమాలు 100 రోజులకు పైగా థియేటర్లో సందడి చేశాయి .. అలాగే లెజెండ్ సినిమా కొన్ని థియేటర్ ల్లో 1000 రోజులకు పైగా ఆడటం మరో అరుదైన రికార్డ్. అలాగే గతంలో బాలకృష్ణ ఓ రాత్రి తాను నటించిన ఆదిత్య 369 సినిమా కు సీక్వెల్ చేయాలని ఆలోచిస్తూ ఆ రాత్రి తెల్లారేసరికి ఆదిత్య 999 అనే  స్టోరీ కూడా సిద్ధం చేశారు బాలయ్య . అలాగే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు .. ఒక కొడుకు తండ్రి పాత్రలో నటించటం అలాగే సినిమాను నిర్మించడం భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఇది తొలిసారి.. ఇలా బాలకృష్ణ కెరియర్ లో ఇవే కాకుండా ఎన్నో అరుదైన ఘనతలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: