బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొద్ది రోజుల క్రితం సైఫ్ అలీఖాన్ పై ఓ దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయాల పాలయ్యాడు. సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సైఫ్ ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ వ్యక్తి చొరబడినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. మొదట దుండగుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిపై దాడి చేసే ప్రయత్నం చేయగా.... దానిని ఆపే క్రమంలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు.


కాగా,  సైఫ్ అలీఖాన్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. సైఫ్‌ అలీఖాన్‌ కొన్ని కోట్లకు అధిపతి అన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, నటి షర్మిల ఠాగోర్ దంపతుల కుమారుడు సైఫ్ అలీఖాన్. పటౌడి కుటుంబానికి చెందిన రూ. 15 వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఎంపీ హైకోర్టు కేంద్రానికి అనుమతులు జారీ చేసింది. ఏనిమి ప్రాపర్టీ చట్టం కింద పాకిస్తాన్ కు వలస వెళ్ళిన వారి ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. పూర్వీకులు అయిన పటౌడి కుటుంబానికి భోపాల్ లో చాలా ఆస్తులు ఉన్నాయి.


వీటిపై సైఫ్, ఆయన తల్లి షర్మిలా, సహా కుటుంబ సభ్యులు కోర్టు మెట్లు ఎక్కారు. ఇన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాపర్టీపై హైకోర్టు స్టే విధించింది. తాజాగా ఈ కేసును హైకోర్టు ఎత్తివేసింది. ఇదిలా ఉండగా యాక్టర్ సైఫ్ అలీఖాన్ దాడి నుంచి వేగంగా కోలుకుంటున్నారు. దీనిపై శివసేన నేత సంజయ్ నిరూపమ్ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ కు 6 కత్తిపోట్లు, మూడు లోతైన గాయాలు అయినట్లుగా తెలిసింది.


మెడ వెన్నెముక దగ్గర 2.5 ఇంచుల లోతు గాయాలు అయ్యాయని తెలియజేశారు. డాక్టర్లు సుమారు 6 గంటల పాటు సర్జరీ చేశారని వెల్లడించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సైఫ్ అలీఖాన్ ఇంత తొందరగా రికవరీ ఎలా అయ్యారని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు సంజయ్ నిరూపమ్. కేవలం ఐదు రోజులలోనే సైఫ్ అలీఖాన్ అంత ఫిట్ గా, కాన్ఫిడెంట్ గా ఎలా నడిచారంటూ ఆయన ప్రశ్నించారు. సైఫ్ అలీఖాన్ బాడీ లాంగ్వేజ్ పైన అనుమానం వస్తుందని సంజయ్ నిరూపమ్ ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: