ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా రెండో రోజు కూడా ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి .. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి దర్శకుడు సుకుమార్ కూడా యాడ్ అయ్యాడు .. ఇక నిన్నటి నుంచి అతని ఇల్లు ఆఫీసుల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. పుష్ప 2 సినిమాకు దర్శకుడు ఈయన అలాగే రెమ్యూనిరేషన్ కాకుండా ఈ సినిమాకి వచ్చిన లాభాల్లో వాటా కూడా తీసుకున్నాడని ప్రచారం కూడా  సుకుమారిపై  జరిగింది .. ఈ క్రమంలోనే హైదరాబాద్ వచ్చిన వెంటనే సుకుమారును నేరుగా అయిన ఆఫీసుకు అట్నుంచి అతని ఇంటికి అధికారులు తీసుకువెళ్లిపోయారు.


ఇదే క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల ఆఫీసులు ఇళ్లపై కూడా ఈరోజు కూడా ఈ దాడులు జరిగాయి .. ఇదే క్రమంలో పుష్ప2 నిర్మించడానికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకువచ్చారని విషయం నుంచి మొదలుపెట్టి సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చాయి .. ఈ కలెక్షన్లకు తగ్గట్టు ఆదాయపు పన్ను చెల్లించార లేదా అనే విషయాలన్నిటి  మీద అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు . ఇదే క్రమంలో పలు కీలక డాక్యుమెంట్స్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.


అయితే ఇదే క్రమంలో ఈరోజు సుకుమార్ పై కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్టుగా ఇప్పుడు వార్తలు బయటకు వచ్చాయి. అయితే సుకుమార్ పై కూడా ఈడి విచారణ జరగటం అనేది ఈరోజు కాదు నిన్నటి నుంచే మొదలైనట్టుగా అసలు విషయం బయటకు వచ్చింది .. అయితే ఈరోజే ఫ్రెష్ గా ఇది మొదలైంది అనేది అవ్వస్తవం అని చెప్పాలి . ఇక నిన్న ఉదయం 6 గంటలకు మొదలైన ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ఈ రోజంతా కూడా కొనసాగుతున్నాయి .. అధికారులు అడిగిన డాక్యుమెంట్ అన్నిటినీ నిర్మాతలు వెంటనే ఇచ్చేస్తే కానీ లేదంటే రేపు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కూడా ఉంది .. ఇక మైత్రి నిర్మాతలు , దిల్ రాజుకు సంబంధించిన వ్యక్తిగత బ్యాంక్ లావాదేవీలు అన్నిటిని నిన్నటికే ఒక దారికి తీసుకొచ్చారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: