పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్‌తేజ్ కలిసిన నటించిన బ్రో సినిమా నుంచి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలను కొనుగోలు చేసే డిస్ట్రిబ్యూటర్లకు అసలైన కష్టాలు మొదలయ్యాయి .. ఒక్క సినిమా ప్లాప్ అయిన తర్వాత తర్వాత వచ్చిన సినిమా అయినా కాపాడుతుందేమో అనుకుంటే ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ గా మిగిలిపోతూ బయ్యర్లకు తీవ్ర నష్టాలు తెచ్చి పెడుతున్నాయి .. ముందుగా బ్రో సినిమా రికవరీ 70% గా ఉంది .. ఇందులో పవన్ రెమ్యూనిరేషన్ ఎక్కువగా ఉండటంతో ఆయన నటించిన సినిమాలన్నీ కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోతున్నాయి .. మెగాస్టార్ చిరంజీవి కాలం చెల్లినిన సినిమాలు రీమేక్ చేయడం రూపంలో బోళా శంకరును తీసుకువచ్చి ఆయన కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ ను మూట కొట్టుకున్నాడు.. ఈ సినిమాను కొన్నవారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కావడం లేదు .. అలాగే ఈ సినిమా తర్వాత నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నుంచి వచ్చిన గాండీవ దారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా సినిమాలు కూడా ఈక్కోవలోకే వస్తాయి. ప్రధానంగా వరుణ్ తేజ్ మట్కా సినిమాకు మొదటి రోజు కూడా పట్టుమని పది లక్షల కలెక్షన్ కూడా రాలేదు.. ఐదో రోజు ఈ సినిమాకు థియేటర్లో ఒక్క రూపాయి కూడా రాలేదు .. అంత ఘోరంగా ఈ సినిమా ప్లాఫ్ అయింది .. ఏ జోనర్‌లో ఎలాంటి సినిమా తీసిన ప్లాప్‌గా మిగిలి పోవడం ..
ప్రస్తుతం వరుణ్ తేజ్ మిర్లపాక గాంధీని గట్టిగా నమ్ముకున్నాడు .. ఆయన దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోకపోతే మార్కెట్ లేని హీరోగా మిగిలిపోతాడు . మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఆది కేశవ రూపంలో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు .. ఇవన్నీ రీజినల్ సినిమాలు ఈ విషయం ఇలా ఉంచితే పాన్ ఇండియా హీరోగా భారీ క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ కు గేమ్ చేంజర్ రూపంలో కెరియర్ లో మరో చెత్త సినిమాను ప్రేక్షకులకు అందించాడు.. ఈ సినిమాకు ముందు ఆచార్య , వినయ విధేయ రామ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ సినిమాలుగా మిగిలిపోయాయి .. మధ్యలో త్రిబుల్ ఆర్ ఒకటే రామ్ చరణ్ ను కాస్త నిలబెట్టింది. ఈ పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులతో పాటు .. టాలీవుడ్ లో ఉన్న నిర్మాతలు.. తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు , బయ్యర్లు మెగా ఫ్యామిలీ సినిమాల కొనుగోలు పై వెనకడుగు వేస్తున్నారు.. ఇదే క్రమంలో చిరంజీవి విశ్వంభర వచ్చే మే నెలలో.. అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మార్చిలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి .. ఇలా ఈ రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయంలో మెగా ఫ్యామిలీ హీరోలకు ఇలాంటి పరిస్థితి రావటంతో భవిష్యత్తులో వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.