టాలీవుడ్‌ నటి తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి పరిచయమే దాదాపు 20 ఏళ్లకు పైనే అవుతుంది. అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది తనదైన నటన, అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది. హ్యాపీడేస్ సినిమాతో ఈ బ్యూటీ తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమా అనంతరం వరుస పెట్టి సినిమాలు చేసి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది.


స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్గా నటించింది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం తరగని అందంతో ప్రేక్షకులను తన సినిమాల ద్వారా అలరిస్తోంది. సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. కాగా, తమన్నా ఇంతవరకు వివాహం చేసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు, రిలేషన్ కొనసాగిస్తున్నట్లు తమన్నా ఓపెన్ గానే రివిల్ చేసింది.


వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకుంటారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా.... తమన్నాకు సంబంధించి ఓ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. చాలామంది అమ్మాయిలకు ఆంటీ అని పిలిస్తే అస్సలు ఇష్టం ఉండదు. చాలా సీరియస్ అవుతారు. కొంతమంది అయితే చెంప చెల్లుమనిపిస్తారు. చాలామంది హీరోయిన్లు వారి వయసు చెప్పుకోవడానికి అసలు ఇష్టపడరు.


అలాంటిది హీరోయిన్ తమన్నాఅమ్మాయి భుజం తట్టి మరీ ఆంటీ అని పిలిపించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రవీనా టాండన్ కుమార్తె రషా తడాని ఓ ఫంక్షన్ లో తమన్నాను ఆంటీ అని పిలవబోయి వెంటనే ఆపేసింది. అప్పుడు తమన్నా వెంటనే నువ్వు నన్ను ఆంటీ అని పిలవవచ్చని బదులలివ్వడంతో రవీనా ఆంటీ అని పిలుస్తూ కాసేపు మాట్లాడింది. ఈ వీడియో వైరల్ కావడంతో తమన్నాను తన అభిమానులు మెచ్చుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: