గత కొద్ది రోజులుగా  చిత్ర పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలు వరుసగా పెళ్లి చేసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే .. ఇప్పుడు తాజాగా మరో మెగా హీరో పెళ్లి చేసుకోబోతున్నట్టు పలు వార్తలు బయటికి వస్తున్నాయి .. ఇంతకీ ఈ మెగా హీరో మరెవరో కాదు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ .. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారని సోషల్ మీడియాలో ప‌లు వార్తలు వైరల్ గా మారాయి . ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటికి రావటంతో మెగా అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు .. అయితే సాయిధరమ్ తేజ్  త‌ల్లికి ఇప్పటివరకు  అమ్మాయి నచ్చకపోవటంతో ఒప్పుకోలేదని తెలుస్తుంది ..


అయితే ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి , రామ్ చరణ్ , సాయిధరమ్ తేజ్ త‌ల్లి తో మాట్లాడి పెళ్లికి ఒప్పించారని అంటున్నారు. పలు అనుకోని కారణాల వల్ల ఇప్పటివరకు దూరంగా ఉన్న మెగా - అల్లు ఫ్యామిలీలు ఈ పెళ్లి వేడుకతో ఒకటి కాబోతున్నారు .. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ పెళ్లికి సంబంధించిన వార్తలు మాత్రం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి .. అయితే ఈ విషయం పై మెగా అభిమానులు కొందరు ఇవి ఫేక్ వార్తలని కొట్టు పడేస్తున్నారు .. గతంలో కూడా ఇలాంటి వార్తలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే .. ఆ తర్వాత కొన్ని రోజులకు అవన్నీ అబద్దాలని తెలియడంతో ఈ పుకార్లకు చెక్ పెట్టినట్టు అయింది.
 

అయితే ఇప్పుడు మరోసారి ఈ పెళ్లికి సంబంధించిన వార్తలు బయటికి రావటంతో కొందరు ఇందులో నిజం ఉండచ్చని అంటున్నారు .. ఈ మెగా మేనల్లుడు సినిమాల విషయానికి వస్తే .. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగటు అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు .. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు .. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సంబంధించిన వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: