టాలీవుడ్ చరిత్రలోనే అతి తక్కువ టైంలో 100 సినిమాలు కంప్లీట్ చేయాలన్న గట్టి నమ్మకంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తన ప్రయాణం మొదలుపెట్టింది .. ఈ సంస్థ నుంచి సినిమాలైతే వేగంగా వస్తున్నాయి కానీ .. అనుకున్నంత స్థాయిలో ఫలితాలు మాత్రం రావట్లేదు .. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు కానీ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోవటం లేదు .. అయితే ఇప్పటివరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జోరు మాత్రం ఎక్కడా తగ్గటం లేదు .. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తూనే ఉన్నారు .. చిన్న పెద్ద మీడియం ఇలా కనీసం ఈ సంస్థ నుంచి ఇప్పుడు 20 కి పైగా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి .. అలాగే మరో 10 సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది .. ఇక ఈ 2025 ఈ సంస్థకు ఎంతో కీలకం .. ఎందుకంటే ఈ సంవత్సరం కనీసం ఐదు సినిమాలు విడుదల చేయాలన్న గడ్డి ప్రణాళికతో ఉంది పీపుల్ మీడియా .. ఇందులో అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా ఉన్న ‘రాజాసాబ్‌’ కూడా ఉంది.
 

ప్రభాస్ , మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజా సాబ్ ఈ సమ్మర్ లోనే ప్రేక్షకుల‌ ముందుకు రాబోతుంది .. వీటితో పాటు సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా, తేజ సజ్జ మిరాయ్‌,  అడ‌విశేష్ ‘గూఢ‌చారి 2.. ఈ సినిమాలు కూడా ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి .. ఈ సినిమాలు అన్నిటిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి .. ఇదే క్రమంలో రీసెంట్గా షూటింగ్ మొదలుపెట్టిన గరివిడి లక్ష్మి సినిమాని కూడా ఈ యాడాదిలోనే విడుదల చేయబోతున్నారు .. ఈ ఐదు ప్రాజెక్టులపై పీపుల్ మీడియా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది . గతంలో చేసిన పలు తప్పుల్ని పునరావతం కాకుండా కథల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని .. పనికిరాని ఖర్చులు తగ్గించాలని పీపుల్ మీడియా భావిస్తుంది.  



ఇక అందుకు తగ్గట్టుగానే వారి టీంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగాయి .. ఇక రాజా సాబ్ హిట్ అయితే పీపుల్ మీడియాకు సగానికి పైగా నష్టాలు తీరిపోతాయి .. అలాగే ఈ 2025లో కనీసం రెండు భారీ హిట్లు వచ్చిన 100 సినిమాల‌ మైలరాయి విషయంలో పెద్ద ఉత్సాహం వచ్చినట్టు ఉంటుంది . అలాగే చిత్ర పరిశ్రమకు విజయాలు ఎంతో అవసరం . ఓ సినిమా హిట్ అయితే ఆస్ఫూర్తితో కనీసం మరో 10కి పైగా సినిమాలు షూటింగ్ కు వెళ్తాయి .. అలాగే రాబోయే కొత్త నిర్మాతలకు గట్టి ధైర్యంగా కూడా నిలుస్తారు. ఇప్పుడు పీపుల్ మీడియా లాంటి పెద్ద పెద్ద సంస్థలు చిత్ర పరిశ్రమను గట్టిగా ప్రభావితం చేయగలవు .. ఇలాంటి నిర్మాణ సంస్థలకు వరుస విజయాలు వస్తే చిత్ర పరిశ్రమ మరింత కలకలాడుతూ ఉంటుంది .. ఈ 2025లో పీపుల్ మీడియా సంస్థకు గేమ్ చేంజర్ గా మారుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: