నమ్రత శిరోద్కర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. నమ్రత తన సినిమాల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. 1977లో శత్రుజ్ఞ సిన్హ దర్శకత్వం వహించిన షిరిడీ కే సాయిబాబా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ప్రారంభించింది. అనంతరం 1998లో జబ్ ప్యార్ కిసీసే సే హోత హై అనే హిందీ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది.


తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి సరసన అంజి సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అనంతరం వరుస పెట్టి సినిమాలలో నటించి తన హవాను కొనసాగించింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ, మరాఠీ, మలయాళం భాషలలో సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. 2000లో బి.గోపాల్ దర్శకత్వం వహించిన వంశీ సినిమాలో నమ్రత హీరోయిన్ గా నటించింది.


హీరోగా మహేష్ బాబు చేశాడు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. అనంతరం వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యి 2005 ఫిబ్రవరి 10వ తేదీన ముంబైలోని మారియట్ హోటల్ లో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత నమ్రత సినిమాలను పూర్తిగా మానేసింది. తన పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యులకే కేటాయించింది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా, నమ్రత శిరోద్కర్ కట్నంగా దాదాపు రూ. 80 కోట్ల వరకు తీసుకువచ్చిందని సమాచారం అందుతుంది.


నమ్రతకు భారీగా ఆస్తులు ఉన్నాయి. మహేష్ బాబుకు కూడా భారీగానే ఆస్తులు ఉన్నాయి. సినిమాల ద్వారా, వ్యాపారాల ద్వారా భారీగా డబ్బులను సంపాదిస్తున్నారు. వారసత్వంగా కూడా కొన్ని ఆస్తులు వచ్చాయి. ఇదిలా ఉండగా.... ఈరోజు నమ్రత శిరోద్కర్ పుట్టిన రోజు. దీంతో సోషల్ మీడియా వేదికగా నమ్రతకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. నమ్రత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: