ఇటీవలే బాలీవుడ్ లో ఒక షోలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ తన పెళ్లి డ్రీమ్ గురించి వెల్లడించింది.. తన పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉండాలనే విషయం గురించి మాట్లాడుతూ.. జాన్వీ కపూర్ పెళ్లి చేసుకొని తిరుమల తిరుపతిలో షటిల్ అవ్వాలనుకుంటున్నానని ముగ్గురు పిల్లలతో ఉండాలి.. ప్రతిరోజు అరటి ఆకులలో భోజనం చేయాలి.. రోజు గోవిందా గోవిందా అనే నామస్మరణం వింటూ ఉండాలి.. అలాగే మణిరత్నం గారి సినిమాలలో ఉండే సాంగ్స్ వినాలి.. మా ఆయన లుంగీ కట్టుకొని చూడడానికి రొమాంటిక్ గా ఉండాలనీ వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.
దీంతో ఈ షో లో హోస్ట్ గా ఉన్న కరణ్ జోహార్ షాక్ అవ్వడమే కాకుండా అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ కల్చర్ లో పెరిగినటువంటి జాన్వీ కి పక్క తెలుగమ్మాయిగా మారిపోవాలని తన భర్త కూడా అలాగే మారాలని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా కూడా తన తల్లి వల్లే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అలాగే సౌత్ అంటే కూడా తనకు చాలా ఇష్టం ఏర్పడింది అన్నట్టు తెలియజేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ 16 వ చిత్రంలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.