నందమూరి బాలకృష్ణ ఇటివలె నటించిన  డాకు మహారాజ్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నిన్నటి రోజున రాత్రి అనంతపురంలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్ర బృందం. అయితే ఈ సక్సెస్ మీట్ లో చాలామంది సెలబ్రిటీలు పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా బాలయ్య మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి వాటి గురించి చూద్దాం.



బాలయ్య మాట్లాడుతూ.. ప్రజలే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు తాను అభిమానులకు  దేవున్ననే.. తెలుగు ప్రజలకు ఎప్పుడు తాను రుణపడి ఉంటానని తెలిపారు. తెలుగు ప్రజల రుణం ఈ జన్మకి తీరదని అంటూ తెలియజేశారు. తన కొనఊపిరి వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని తెలిపారు బాలయ్య. కేవలం వినోదమే కాదు ఎన్నో సందేశాత్మక సినిమాలలో నటించడం కూడా చేస్తానని తెలిపారు. కొంతమంది ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరు అని అంటూ ఉంటారు.. నన్ను చూసుకొనే నాకు పదునైన పొగరు ఉంటుందంటూ బాలయ్య చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.



తనకి అన్నీ తెలుసా అని అనుకుంటూ ఉంటారు.. నన్ను నాకు తెలిసే విద్య కంటే ఏమీ లేదనే విషయంపైనే గుర్తిస్తానని  తెలిపారు బాలయ్య.. తనలో ఉండే పట్టుదల కేవలం సినిమాలలోనే కాదు జీవితంలో కూడా తమకంటూ ఒక అర్థం ఉండాలని విషయాన్ని గ్రహిస్తానని తెలిపారు బాలయ్య.. అభిమానుల నిజమైన తన ప్రజాకర్తలు అంటూ తెలియజేశారు. తాను ఎప్పుడు సినిమా కలెక్షన్స్ గురించి ఈ పట్టించుకోనని తెలియజేశారు.. కానీ అభిమానులకు మాత్రం తన రికార్డ్స్ అన్నీ కూడా బద్దల కొడతారని తెలుసు అంటు బాలయ్య మాట్లాడారు. తన కలెక్షన్స్ అన్ని ఒరిజినల్ అని , తన రికార్డ్స్ అన్నీ కూడా ఒరిజినల్ అని తన అభిమానం కూడా ఒరిజినల్ అని గ్రహిస్తారంటు తెలిపారు బాలయ్య. ప్రస్తుతం బాలయ్య చేసిన ఈ వాక్యాలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: