కాగా రీసెంట్గా టబు ఊహించని చిక్కుల్లో ఇరుక్కుంది . హీరోయిన్ టబు 2024 లో ఓ మూవీలో నటించింది. 2024లో హీరోయిన్ టబు "క్రూ" అనే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా పాల్గొని మాట్లాడింది. ఈ క్రమంలోనే కొన్ని మీడియా రిపోర్టర్స్ ఆమెను ప్రశ్నించారు. పెళ్లిపట్ల పదేపదే ప్రశ్నిస్తూ వచ్చారు . దీని కారణంగా టబు రియాక్ట్ అయింది . వివాహం పట్ల ఆసక్తి లేదు అని చెప్పింది . అయితే దాన్ని డబల్ మీనింగ్ గా రాసేశారు కొంతమంది మీడియా రిపోర్టర్స్ . అది సోషల్ మీడియాలో మరింత వల్గర్ గా మారిపోయింది.
"బెడ్ షేరింగ్ మాత్రమే కావాలి . అలాంటి వ్యక్తిని కోరుకుంటున్నాను" అంటూ టబు చెప్పినట్లు కొన్ని మీడియా పత్రికలు రాసేసాయి. దీంతో టబు అలాగే టబు టీం సీరియస్ అయింది . అసలు టబు ఎప్పుడు అలా అనలేదు అని ..అనని మాటలను అలా ఎలా రాస్తారు ..? అంటూ మండిపడుతున్నారు . అంతేకాదు ఇది టబు సినీ కెరీర్ కి కాదు పర్సనల్ కెరియర్ కి సైతం నెగిటివ్గా మారిపోతుంది అంటున్నారు . ఈ క్రమంలోనే టబు ఫ్యాన్స్ కూడా కొంచెం సీరియస్ అయిపోయారు . అసలు ఇలా ఎలా మాట్లాడగలరు ..? ఆమె వ్యక్తిగత లైఫ్ ఆమె ఇష్టం . సినిమాలకి ఆమె వ్యక్తిగత లైఫ్ కి కొంచెం ప్రైవసీ ఉంటుంది. అది ఆమెకి ఇవ్వండి ..కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరైనా ఇలా మాట్లాడతారా ..? ఆమె చెప్పని మాటలను చెప్పినట్లు కల్పిస్తారా..? అంటూ కూసింత ఓవర్గానే ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు . దీనితో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ అయిన టబు పేరు మారుమ్రోగిపోతుంది..!