టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకరు. కృష్ణ గారు తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తనకంటూ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే కృష్ణ గారు తన కెరీర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. అందులో కొన్ని సినిమాలు ఏకంగా ఇండస్ట్రీ హిట్లు కూడా అయ్యాయి. మరి సూపర్ స్టార్ కృష్ణ వదిలేసిన ఇండస్ట్రీ హిట్ మూవీలు ఏవో తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తో చిరంజీవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ అప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసే టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ మూవీ ని మొదట మేకర్స్ కృష్ణ తో చేయాలి అనుకుని ఆయనకు కథను కూడా వినిపించారట. కానీ ఆయన మాత్రం ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. దానితో చిరంజీవి తో ఈ సినిమాను చేయగా ఈ మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర అనే మూవీ రూపొంది ఇండస్ట్రీ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. ఈ మూవీ కథను విజయేంద్ర ప్రసాద్ మొదట కృష్ణ గారికి వినిపించాడట. కథ మొత్తం విన్న ఆయన కొన్ని కారణాల వల్ల ఈ మూవీ కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు రాజమౌళి ఇదే కథను చరణ్ తో రూపొందించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇలా కృష్ణ తన కెరీర్లో ఖైదీ , మగధీర కథలను రిజెక్ట్ చేయగా ఈ రెండు మూవీలు ఇండస్ట్రీ హిట్లు అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: