మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఫేక్ లెక్కలు ఎక్కువైపోతున్నాయి అన్న కారణంగానే ఈ ఐటి రైడ్స్ నిర్వహిస్తున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది . కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ అందరి స్టార్స్ ఇళ్లపై ఐటి రైడ్స్ జరుగుతున్నా మూమెంట్లో ఒక బిగ్ బడా పాన్ ఇండియా స్టార్ హీరో అన్న రాత్రికి రాత్రి పెట్టే బేడా సర్దుకొని దేశం నుంచే జంప్ అయిపోయిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . ఈయన ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ అన్నా ..ఓన్ బ్రదర్ అని చెప్పలేము కానీ కజిన్ అవుతాడు .
అయితే హైదరాబాద్ సిటీలో గత మూడు రోజుల నుంచి ఐటి రైడ్స్ వాళ్ళు ఎలా స్టార్స్ కి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. ఇలాంటి మూమెంట్లోనే పుష్ప సినిమా సుకుమార్ ఇళ్లు ఆఫిస్ పై కూడా ఐటి రైడ్స్ నిర్వహించడం సంచలనంగా మారింది. ఈ మూమెంట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు అలెర్ట్ అయ్యారు . ఆ కారణంగానే ఈ పాన్ ఇండియా హీరో కజిన్ బ్రదర్ రాత్రికి రాత్రే జంప్ అయ్యాడు అన్న న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.