సైఫ్ అలీఖాన్ రీసెంట్ గా లీలావతి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అయినప్పటికీ ఆయనకు సంబంధించిన కత్తిదాడి వార్తలు మాత్రం ఆగడం లేదు. అయితే పోలీసులు గంటకొక విషయాన్ని బయట పెడుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక తాజాగా సైఫ్ పై కత్తి దాడి జరిగిన దానిపై సంచలన నిజం బయటపడింది. అదేంటంటే సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి జరుగుతున్న సమయంలో దగ్గరుండి చూసిన ఇంటి పనిమనిషి సంచలన విషయాలను బయటపెట్టింది.ఏదైనా ఘటన జరిగితే దానికి సంబంధించి ఎన్నో రకాల వివరాలు సేకరిస్తూ ఉంటారు.మీడియా వాళ్లయితే దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటారు.ఇక సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి విషయంలో కూడా ఇంట్లో ఉండే పని వాళ్ళను మీడియా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే సైఫ్ ఇంట్లో పనిచేసి పనిమనిషి ఓ సంచలన నిజం బయట పెట్టింది.సైఫ్ ఇంట్లో పనిమనిషి ఎలియామా ఫిలిప్ మాట్లాడుతూ.. సైఫ్ పై కత్తిదాడి జరిగేకంటూ ముందు మేము ఆ దొంగని చూసిన సమయంలో అందరం కలిసి ఆయనను ఓ రూమ్లో వేసి బంధించాము. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి సైఫ్ పై ఎలా దాడి చేశాడో అర్థం అవ్వడం లేదు. మొదట్లో ఏదో సౌండ్ వస్తుందని బయటికి వచ్చిన సమయంలో నిందితుడు బాత్రూం నుండి బయటకు వచ్చాడు.ఆ సమయంలో నేను అరవడంతో అందరూ వాళ్ల రూమ్ ల నుండి బయటకు వచ్చారు.అయితే నిందితుడు షరిఫుల్ మాత్రం ఎవరూ బయటికి వెళ్లద్దు అంటూ హేగ్సా బ్లెడ్, ఒక వెదురు కర్ర తన చేతిలో పట్టుకొని భయపెట్టించాడు. ఆ టైంలో నేను సైఫ్ బాబు కోసం వెళ్తున్న సమయంలో షరిఫుల్ నాపై అటాక్ చేశాడు. అలాగే నా చేతులు కూడా కాస్త కోసుకున్నాయి.

 ఆ టైంలో సైఫ్ అతన్ని కొద్దిసేపు ఆపేసాడు. కానీ ఆ తర్వాత మేమందరం ఆ నిందితుడిని రూమ్లో వేసి డోర్ లాక్ చేసి వెళ్ళాం.కానీ ఆ తర్వాత షరిఫుల్ ఆ రూమ్ నుండి బయటికి ఎలా వచ్చాడో ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది అంటూ సైఫ్ ఇంటి పనిమనిషి ఎలియామా ఫిలిప్ సంచలన విషయాలు బయట పెట్టింది. అయితే పనిమనిషి చెప్పిన దాని ప్రకారం చూస్తే సైఫ్ పై అటాక్ చేసిన వ్యక్తిని ముందుగానే రూమ్లో వేసి డోర్ లాక్ చేశారు. కానీ ఆ వ్యక్తి బయటికి ఎలా వచ్చారు ఇంట్లో ఉన్న వాళ్లే ఆయనకు సహాయం చేసి ఆ డోర్ లాక్ తీసి సైఫ్ పై అటాక్ చేసేలా చేశారా అని చాలామంది అనుమాన పడుతున్నారు. ఇక ఈ విషయంలో ఇంకా ఎన్ని నిజాలు బయట పడతాయో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: