తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి తన కెరియర్లో ఎంతో మంది దర్శకులతో పని చేసి ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అదే సమయంలో కొంత మంది దర్శకులతో చిరంజీవి కి అపజయాలు కూడా వచ్చాయి. ఇకపోతే చిరంజీవి కెరీర్ లో తనకు అద్భుతమైన విజయాలను అందించిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. చిరంజీవి , బి గోపాల్ కాంబోలో కొన్ని సంవత్సరాల క్రితం ఇంద్ర అనే ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చి ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదలు కాకముందు ఓ కారణంతో బి.గోపాల్ చిరంజీవి తో సినిమా నే వద్దనుకున్నాడట. ఆ కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

చిరంజీవి , బి.గోపాల్ కాంబినేషన్లో ఇంద్ర మూవీ కంటే ముందు మెకానిక్ అల్లుడు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ లో విజయశాంతి , చిరంజీవి కి జోడిగా నటించగా ... అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత బి గోపాల్ కి చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆయనకు చిన్ని కృష్ణ దగ్గర ఉన్న ఇంద్ర సినిమా కథ మొదట పెద్దగా నచ్చలేదట. దానితో అనవసరంగా రిస్క్ చేయడం మంచిది కాదు. చిరంజీవికి అప్పటికే మెకానిక్ అల్లుడు సినిమాతో అపజయాన్ని ఇచ్చాను. మరో అపజయాన్ని ఇవ్వడం కరెక్ట్ కాదు. స్టోరీ సూపర్ గా ఉంది అనిపిస్తేనే ప్రొసీడ్ అవుతాము అని ఆయన అనుకున్నాడట. కానీ ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ కన్విన్స్ చేయడంతో చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో ఇంద్ర మూవీ ని రూపొందించాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: