సంక్రాంతి కానుకగా విడుదలైన బాలకృష్ణ, బాబీ కొల్లి మూవీ "డాకు మహారాజ్" బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విడుదలైన ఫస్ట్ రోజు నుంచే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది ఆడియన్స్ దీని బాగా మెచ్చారు. క్రిటిక్స్ సైతం టాప్ రేటింగ్స్ అందించారు. ఈ సినిమా, పాటలు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఓవరాల్‌గా ఇది పెద్ద హిట్ కావడంతో సినిమా విజయోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ఇటీవల అనంతపురంలో జరిగిన "విజయోత్సవ పండుగ"లో బాలకృష్ణ తన ఫ్యాన్స్ ఒక ప్రత్యేకమైన రీతిలో అలరించారు. ఈ వేడుకలో ఆయన స్వయంగా "డాకు మహారాజ్" సినిమాలోని ఒక పాటను పాడి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. బాలకృష్ణ పాట పాడుతుంటే ఫ్యాన్స్ కేరింతలు, ఈలలతో హోరెత్తించారు. ఆ సమయంలో అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా పెద్ద జోష్ వచ్చేసింది.

బాలకృష్ణ పాట పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో సినిమా విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. "డాకు మహారాజ్" సినిమా బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పండుగ సమయంలో విడుదలైన సినిమాలలో ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి, థియేటర్ల వద్ద సందడి నెలకొనేలా చేసింది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. వారి అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. అంతేకాకుండా, మంచి కథలు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ నటిస్తూ, ప్రేక్షకులందరినీ అలరిస్తానని హామీ ఇచ్చారు. చివరి శ్వాస వరకు కష్టపడి, మంచి పాత్రల్లో నటిస్తూనే ఉంటానని బాలయ్య స్పష్టం చేశారు.

"డాకు మహారాజ్" సినిమా రాబోయే పండుగల సినిమాలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో అభిమానులతో పాటు సినీ పరిశ్రమ కూడా సంబరాలు చేసుకుంటోంది. ఈ విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ తన అభిమానులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: