టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలయ్య ఏది చేసినా హైలెట్ అవుతుంది. ఆయన చేసే సినిమాల నుంచి రాజకీయాల వరకు.... ప్రతి ఒక్కటి హల్చల్ అవుతుంది. ఆయన మైకు పట్టిన... లేదా స్టేజి పైకి ఎక్కిన... ఏదో ఒక వివాదం ఈ మధ్యకాలంలో రాజుకుంటుంది. ముఖ్యంగా డాకు మహారాజ్ సినిమా రిలీజ్ కంటే ముందే... నందమూరి బాలయ్య చుట్టూ చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ ఊర్వసి రౌతేలా, నందమూరి బాలయ్య మధ్య ఉన్న రొమాంటిక్ సాంగ్ వివాదంగా మారిన సంగతి తెలిసిందే.


 ఇది ఇలా ఉండగా... నందమూరి బాలయ్య హీరోగా చేసిన డాకు మహారాజ సినిమా.. తాజాగా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మంచి కలెక్షన్ లను రాబడుతున్న నేపథ్యంలో... అనంతపురంలో భారీ ఈవెంట్ నిర్వహించింది చిత్ర బృందం. బుధవారం రోజున రాత్రి... నాకు మహారాజ సక్సెస్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ కు... చిత్ర బృందం సభ్యులందరూ వచ్చారు.

 ముఖ్యంగా నందమూరి బాలయ్య అలాగే బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ నేపథ్యంలోనే... స్టేజి పైన ఊర్వశి అలాగే నందమూరి బాలయ్య ఇద్దరు... కాస్త సరదాగా కనిపించారు. చిన్నగా హాగ్ ఇచ్చినట్లు కూడా నందమూరి బాలయ్య చేశారు. వాస్తవానికి... బాలయ్య చెడు దృష్టితో అలా చేయలేదు కానీ... కొంతమంది నందమూరి బాలయ్య ను టార్గెట్ చేస్తూ తప్పుడు పోస్టులు పెడుతున్నారు.

 ఊర్వశి తో బాలయ్య సాన్నిహిత్యంగా ఉన్న  వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను కొంతమంది వైసిపి కార్యకర్తలు షేర్ చేస్తూ... ఈ వయసులో ఇదేం పని బాలయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొన్న సినిమాలోని రొమాంటిక్ సాంగ్లో కూడా ఇలాగే రెచ్చిపోయావు....? మళ్లీ ఇప్పుడు స్టేజి పైన ఆట ఆడుకుంటున్నావు అంటూ... సెటైర్లు పెంచుతున్నారు. కాగా జనవరి 12వ తేదీన నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా రిలీజ్... మంచి కలెక్షన్లను రాబడుతున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: