అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన శ్రీ సుధ అంటే చెప్పనక్కర్లేదు.ఈ నటి కేవలం అర్జున్ రెడ్డి మూవీ లోనే కాకుండా హారర్ మూవీ అవును, సరిలేరు నీకెవ్వరు, బాడీగార్డ్, వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి వంటి సినిమాల్లో నటించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ సుధ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.అలాగే ఎవరైనా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తే అస్సలు సైలెంట్ గా ఉండదు. వారికి అప్పుడే ఇచ్చిపడేస్తుంది. అయితే చాలా రోజుల నుండి శ్రీ సుధ ఓ వివాదం కొనసాగిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అదేంటంటే.. శ్యామ్.కే.నాయుడుతో పెళ్లి మ్యాటర్.. సినిమాటోగ్రాఫర్స్ అయినటువంటి శ్యామ్ కె నాయుడు,చోటా కె నాయుడు అంటే ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేర్లు. అయితే తెర వెనుక ఫోటోగ్రాఫర్ గా పని చేసే శ్యామ్ కె నాయుడు తనని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పూర్తిగా వాడుకొని తీరా నన్ను పెళ్లి చేసుకోకుండా వదిలేశాడు అంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

అప్పట్లో ఈ మ్యాటర్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.అయితే శ్యామ్ కె నాయుడు పై పోలీస్ కేసు నమోదవ్వడంతో ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దవాళ్లు ఆమెను ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోమని, వెంటనే కేసు వాపస్ తీసుకోవాలి అని డిమాండ్ చేశారట. కానీ ఎవరు ఎంత ఒత్తిడి చేసినా కూడా శ్రీ సుధ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇప్పటికీ శ్యామ్ కే నాయుడి పై పోరాటం చేస్తూనే ఉంది. తన న్యాయపోరాటం అస్సలు ఆగదని,నేను ఎక్కడా కూడా రాజీపడనని నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాను అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా శ్రీ సుధ చెప్పుకొచ్చింది. అయితే శ్యామ్ కె నాయుడు,చోటా కె నాయుడు ఇద్దరి నిజ స్వరూపం ఓ ఇంటర్వ్యూలో బయటపెడుతూ..నాకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు ఉన్న సమయంలో ఉదయం 6 గంటలకే షూటింగ్ కి రమ్మనేవారు.అయితే షూటింగ్స్ ఉన్న సమయంలో నా ఇంట్లో అర్ధరాత్రి వరకు శ్యామ్ కే నాయుడు అరిచేవాడు.

 అంతే కాదు ఆయన టార్చర్ తో నాకు నిద్ర కూడా పట్టేది కాదు. కానీ తెల్లవారితే ఏమీ జరగనట్టుగా ప్రవర్తించేవాడు. అసలు నేను రాత్రి ఎలాంటి గొడవ చేయలేదు.నేను సైలెంట్ గానే పడుకున్నాను అని అనేవాడు. కానీ ఆయన ప్రవర్తించే తీరు నాకు అనుమానం కలిగించి చాలాసార్లు అర్ధరాత్రి ఆయన గొడవ ను రికార్డింగ్ చేశాను. అయితే అప్పటి రికార్డులు ఇప్పుడు నాకు పోలీస్ కేసు విషయంలో చాలా ఉపయోగపడుతున్నాయి.అయితే శ్యామ్ కే నాయుడు టార్చర్ భరించలేక ఆయన అన్న చోటా కె నాయుడు దగ్గరికి వెళ్లి మీ తమ్ముడు ఇలా చేస్తున్నారండి అని చెప్పాను.దానికి చోటా కె నాయుడు చాలా నీచంగా నా తమ్ముడు తో నీకున్న గొడవ సెటిల్ చేస్తాను. కానీ అలా సెట్ చేస్తే నాకేంటి నాకేమిస్తావు అన్నట్లుగా మాట్లాడారు. ఆయన మాటలకి నాకు చాలా బాధేసింది అంటూ అన్నదమ్ములిద్దరి నిజస్వరూపాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది శ్రీ సుధ.  ప్రస్తుతం ఈమె మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: