విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. దిల్ రాజు ఈ మూవీని నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా ఇప్పటివరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుందు. ఇక ఎనిమిదవ రోజు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసుకున్న టాప్ 10 మూవీస్ లలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అద్భుతమైన స్థానంలో నిలిచింది. మరి ఈ సినిమా ఎనిమిదవ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ టెన్ తెలుగు మూవీల లిస్టులో ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.33 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , అలా వైకుంఠపురంలో సినిమా 7.92 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , కల్కి 2898 AD సినిమా 7.52 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలోనూ , సరిలేరు నీకెవ్వరు సినిమా 6.60 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. బాహుబలి పార్ట్ 2 సినిమా 6.58 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా , సైరా నరసింహా రెడ్డి మూవీ 5.91 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో కొనసాగుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 4.90 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలో ఉంది. హనుమాన్ సినిమా 4.75 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , పుష్ప పార్ట్ 2 సినిమా 4.59 కోట్ల కలెక్షన్లతో తొమ్మిదవ స్థానంలోనూ , ఎఫ్ 2 సినిమా 4.38 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: